Wednesday, February 4, 2026 11:29 PM
Wednesday, February 4, 2026 11:29 PM

బీహార్ లో కుక్కకు అడ్రస్ సర్టిఫికేట్.. నకిలీ ఓటు కోసం..?

బీహార్ ఎన్నికల నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నకిలీ ఓటర్లను ఏరివేసే కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఇటీవల వేలాది సంఖ్యలో ఓటర్లను తొలగించింది. దీనిపై వివాదం కూడా రేగింది. పశ్చిమ బెంగాల్ లో నివాసం ఉండే రోహింగ్యాలకు ఓటు హక్కు ఇప్పించారు అనే ఆరోపణలు సైతం వచ్చాయి. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వలస వచ్చిన వారికి పెద్ద ఎత్తున ఓటు హక్కు, ఆదార్ కార్డ్ లు ఉన్నాయని భావించిన ఎన్నికల సంఘం వారిని ఏరి వేస్తోంది.

Also Read : ప్లీజ్ సేవ్ మీ.. ఈ ఒక్కసారికి..!

ఈ ప్రక్రియలో భాగంగా ఓ సర్టిఫికేట్ ఆశ్చర్యం కలిగించింది. కుక్కకు కూడా అడ్రస్ సృష్టించారు కొందరు. ఈ సర్టిఫికెట్ తల్లిదండ్రుల వివరాలతో కూడా ఉండటం గమనార్హం. దీనికి రెవెన్యూ అధికారి మురారి చౌహాన్ డిజిటల్ సంతకం కూడా చేసారట. పబ్లిక్ సర్వీస్ రైట్ పోర్టల్ ద్వారా జారీ చేసిన ఈ సర్టిఫికెట్‌లో కుక్క పేరు “డాగ్ బాబు” అని, దాని తండ్రి పేరు “కుత్తా(హిందీలో కుక్క) బాబు” అని, దాని తల్లి పేరు “కుటియా దేవి” అని పేర్కొన్నారు. డాగ్ బాబు మసౌర్హి పోస్టాఫీస్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు సర్టిఫికేట్ లో ఉంది.

Also Read : సింగపూర్ లో చంద్రబాబు.. టార్గెట్ ఇదే

విమర్శలు రావడంతో వెంటనే దర్యాప్తు చేసిన అధికారులు ఆ సర్టిఫికెట్ ఢిల్లీకి చెందిన ఒక మహిళకు పత్రాలతో లింక్ చేసి ఉందని తేల్చారు. ఆమె ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోర్టల్‌ లో అప్‌ లోడ్ చేశారు, నకిలీ ఓటు కార్డు కోసం.. సర్టిఫికెట్‌ను సృష్టించేందుకు ఎవరో ఆమె డేటాను ట్యాంపరింగ్ చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. జూలై 24న మధ్యాహ్నం 3.56 గంటలకు సర్టిఫికెట్ జారీ చేసారని, వెంటనే మధ్యాహ్నం 3.58 గంటలకు రెండు నిమిషాల్లోనే రద్దు చేసారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్