గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ప్రభుత్వ అధికారులకు అదానీల నుంచి భారీ ముడుపులు అందాయని కేసు నమోదు అయింది. సీకీ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణల నేపధ్యంలో కేసు నమోదు చేసారు. విద్యుత్ ఒప్పందాల గురించి ఏపీలో విదేశీ అధికారులతో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న అదాని భేటీ అయ్యారు. భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్ల లంచం ఆ భేటీ తర్వాత ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.
కేవలం ఏపీ ఒప్పందాల కోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చారు అప్పట్లో. దీనితో ఏపీ డిస్కమ్ లు భారీగా నష్టపోయాయి. విద్యుత్ ఒప్పందాలు స్పీడ్ గా కుదిరేందుకు అదానీ భారీగా ముడుపులు చెల్లించారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు పాత్ర ఉందని గుర్తించారు. నిందితులుగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీల పేర్లు చేర్చారు. ఇదే వ్యవహారంపై మరో ఆరుగురిపై కూడా కేసు నమోదు అయింది. న్యూయార్క్ ఈస్ట్‌ర్న్ డిస్ట్రిక్ కోర్టులో కేసు నమోదు చేసారు.
Also Read : కవిత మౌనం.. రాజకీయ వ్యూహమా?
అక్టోబర్ 24వ తేదీన కేసు నమోదు చేసారు. ఐదుగురు ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో… అధికారుల పాత్రపై ధర్యాప్తు కూడా జరుగుతోంది. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్ర సోలార్ ప్రాజెక్టులకు త్వరిత గతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్టు గుర్తించారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ చేంజీలో లిస్టయిన కంపెనీ పాత్ర కెనడా ఇన్వెస్టర్ కు పాత్ర ఉందని గుర్తించారు.
ఈ అవినీతి వల్ల కంపెనీలకు 200 కోట్ల డాలర్ల లబ్ధి చేకూరినట్టు గుర్తించారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అప్పటి సీఈవో వినీత్ జైన్ పై కేసు నమోదు అయింది. అమెరికాలో లిస్టయిన ఓసియార్ ఎనర్జీ రంజిత్ గుప్తాపై కేసు నమోదు చేసారు. ఏపీలో రూ.40 వేల కోట్లతో ఓసియార్ ప్లాంట్ ఏర్పాటు చేసారు. జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న ఈ కంపెనీతో జరిగిన ఒప్పందాల్లో ఏపీ ప్రభుత్వ అధికారి కీలక పాత్ర పోషించారు. 2019 మే నుంచి 2024 జూన్ వరకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించారు.
Also Read : వర్మని ప్రభుత్వం క్షమిస్తే.. ప్రజలు టిడిపిని క్షమిస్తారా?
ఇందుకోసమే జగన్ ప్రభుత్వం గతంలో టిడిపి ప్రభుత్వం చేసుకున్న సోలార్ ఒప్పందాలను రద్దు చేసుకుందని, కేంద్రం హెచ్చరిస్తున్నా జగన్ సర్కార్ ఒప్పందాలను రద్దు చేసుకోడానికి కారణం ఈ అవినీతే కారణం అంటూ పాలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఈ కథనాలు నిజం అయితే.. అదానీ దెబ్బకి జగన్ మెడకు వచ్చు బిగుసుకున్నట్లే లెక్క.