సినిమా వాళ్లకు రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. పలువురు సినీ నటులు రాజకీయాల్లో సక్సెస్ కాగా మరికొందరు ఫెయిల్ అయ్యారు. కొందరు సొంత పార్టీలు పెట్టగా మరికొందరు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో తమ భవిష్యత్తు వెతుక్కున్నారు. ఇటీవలి కాలంలో.. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీ కూడా స్తాపించారు. తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసారు.
Also Read : ఏమయ్యారు వాళ్లంతా.. ప్రజలు మర్చిపోయారా..?
ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ సుమన్ కూడా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్.. టీడీపీకి ముందు నుంచి దగ్గరగా ఉన్నారు. పలు సందర్భాల్లో సిఎం చంద్రబాబుపై ప్రశంశలు కూడా కురిపించారు సుమన్. తన తొలి రాజకీయ గురువు చంద్రబాబే అని ఇటీవల ఓ సమావేశంలో ఆయన కామెంట్ చేసారు. చంద్రబాబును చూసే సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని కూడా తెలిపారు. విజన్ ఉన్న ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరితగతిన పూర్తయి అభివృద్ధి దిశగా పయనించాలని కామెంట్ చేసారు.
Also Read : ఎమ్మెల్యే కూన రవికుమార్ తో బోస్టన్ ప్రవాసాంధుల ఆత్మీయ సమావేశం
తొలిసారి వాజ్ పేయి, చంద్రబాబు హయాంలో రాజకీయాల్లో అడుగుపెట్టానని.. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని, అయితే, ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అప్పుడు వ్యాఖ్యానించిన సుమన్.. ఇప్పుడు మరోసారి ఆసక్తికర కామెంట్ చేసారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లోకి వస్తానని, త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి.. తమిళనాడులో సీటు ఇస్తామని అంటున్నారని తెలిపారు. ఆలోచించి నిర్ణయం చెప్తానని చెప్పానన్నారు సుమన్.