Tuesday, October 28, 2025 04:24 AM
Tuesday, October 28, 2025 04:24 AM
roots

మిస్టర్ జగన్ రెడ్డీ….నోరు అదుపులో పెట్టుకో : ఏబీ వెంకటేశ్వరరావు

గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం అనే నానుడి సాక్షి ఛానల్ కు ఆ ఛానల్ అనుబంధ మీడియా సంస్థలకు సరిగా సరిపోతుంది. జగన్ నీతి, నిజాయితీకి ప్రత్యక్ష రూపం అని చెప్పుకునే సాక్షి ఛానల్… ఎదుటి వారిపై బురద జల్లడంలో ఎన్నో శిఖరాలు అధిరోహించింది అనే చెప్పాలి. టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే అనుమానంతో ఎందరో అధికారులపై బురద జల్లడం మొదలుపెట్టింది. అందులో ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావు లక్ష్యంగా ఎన్నో ఆరోపణలు చేసింది. తమ యజమాని కోపాన్ని… సాక్షి తప్పుడు రాతలతో లేని వాటిని సృష్టించింది.

Also Read : కర్ణాటక కాంగ్రెస్ మంత్రికి భారీ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా…?

ఇటీవల ఏబీవీపై గత ప్రభుత్వం పెట్టిన కొన్ని అక్రమ కేసులను ప్రభుత్వం ఉప సంహరించుకుంటే వాటిపై సాక్షిలో కథనాలు రాసారు. నిఘా పరికరాల కొనుగోలు… అలాగే ప్రతిపక్ష నేతల ఫోన్ లు ట్యాప్ చేసినట్టు నిర్ధారణ అయిందని కేసు నమోదు చేసినట్టు సాక్షి రాసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆ కేసులు ఏవీ రుజువు కాకపోయినా రుజువు అయినట్టు విచారణ చేసినట్టు రాసుకొచ్చారు. ఆ రాతలపై తాజాగా ఏబీవీ ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. అదే స్థాయిలో ఘాటుగా సమాధానం చెప్పారు. నికార్సైన పోలీసుగా పనిచేసిన నేను చట్టంపై నమ్మకంతో చెపుతున్నాను… వీళ్లకు చట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తానని హెచ్చరించారు.

అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని పక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇంకా బయటకు రాలేదని అన్నారు. ఎందుకంటే అదే వాళ్ల జీవన విధానం…. బతుకుదెరువు కూడా! అని ఘాటు వ్యాఖ్యలు చేసారు. అసలు ఆయనపై అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయలేదు. కాని ఆయనపై కేసు నమోదు అయిందని… ఫోన్ ట్యాపింగ్ చేసారని రాసింది. వైసీపీ చేసిన ఆరోపణలను నిజాలుగా రాసింది సాక్షి.

Also Read : దొంగలు పడ్డ ఆరు నెలలకు.. మౌనం వీడిన మంత్రి గారు…!

దీనిపై కూడా ఏబీవీ సమాధానం ఇచ్చారు. తన మీద పెట్టిన అక్రమ కేసులో అసలు ఫోన్ టాప్పింగ్ అనే అంశమే లేదనీ తెలుసు. అయినా ఆరోపణలకు, కేసుకూ, విచారణకు తేడా తెలియకుండా బురద జల్లుతున్న సాక్షి దినపత్రిక తో పాటు… మరో యూట్యూబ్ ఛానల్ కు పరువునష్టం నోటీసులు పంపానని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసారు. కాగా కేసులను ఉపసంహరించుకునే ముందు ప్రభుత్వం విచారణను కూడా పరిగణలోకి తీసుకునే అడుగులు వేసింది. అప్పట్లో ఏబీవీని విధుల్లో జాయిన్ కాకుండా ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్