కరోనా తర్వాత ప్రాణాలకు గ్యారెంటీ లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. గతంలో కూడా గ్యారెంటీ లేకపోయినా.. గుండెపోటు చిన్న పిల్లలకు రాదూ అనే ఒక నమ్మకం ఉండేది. అందుకు ఎవరూ మినహాయింపు కాదు, గుండెపోటు అర్హతకు వయసుకు సంబంధం లేదని స్పష్టత వచ్చేసింది. స్కూల్ పిల్లలు, క్రికెట్ ఆడుకునే యువకులు, ఇంట్లో టీవీ చూసే కుర్రాళ్ళు ఇలా ఎందరో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఓ జిల్లాలో మూడు నెలల్లో దాదాపు వంద మంది మరణించారు.
Also Read : ఫ్రీలాన్స్ వీసా ఆఫర్ చేస్తోన్న జర్మనీ.. రూల్స్ ఇవే..!
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నాగోల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. గుండ్ల రాకేష్ గా గుర్తించిన ఆ యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అతను ఖమ్మం జిల్లాలోని తల్లాడకు చెందిన మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జ్జరిగింది.
Also Read : రోగులు ఏటీఎంలు కాదు.. హైకోర్ట్ సంచలన కామెంట్స్
ఆదివారం రాత్రి 8:00 గంటల ప్రాంతంలో నాగోల్ స్టేడియంలో జరిగిన డబుల్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో రాకేష్ పాల్గొంటున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది. షటిల్ కాక్ తీసుకోవడానికి వంగిన కొన్ని క్షణాలలో అతను ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరిచింది. తోటి ఆటగాళ్ళు వెంటనే అతని వద్దకు వెళ్లి సిపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండా పోయింది. అతను చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటాడు అని, నిత్యం వ్యాయామం, షటిల్ ఆడతాడు అని అతని ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఈ మధ్య మహిళలు కూడా గుండెపోటుతో మరణించడం కంగారు పెడుతోంది.