ఏపీలో మంత్రి లోకేష్ పుట్టిన రోజు వేడుకలను మంత్రులు అత్యంత ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. కార్యకర్తలు, ప్రజల సమక్షంలో ఈ వేడుకలను పండుగ వాతావరణంలో జరిపారు. విజయనగరంలో ఈ వేడుకలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్వహించడంతో పార్టీ కార్యకర్తలు నేతలు హర్షం వ్యక్తం చేసారు. జిల్లా పార్టీ నేతలను సమన్వయం చేస్తూ.. సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, ఎంపీ అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి వేడుకలను విజయవంతం చేసారు.
Also Read : బుల్డోజర్లు రెడీ.. హైడ్రా సరికొత్త వ్యూహం
ముఖ్యంగా రక్తదాన శిభిరం ఇక్కడ హైలెట్ అయింది. 2 వేల మంది రక్తదానం కొరకు హాజరు కావడం గమనార్హం. వాస్తవానికి వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందు భావించారు. కాని 2 వేల మంది హాజరై… వెయ్యి మంది.. రక్తదానానికి నమోదు చేయించుకోవడం విశేషం. గ్రామ స్థాయి నుంచి పార్టీ నేతలను ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ఇక తాను మంత్రి హోదాలో ఉన్నా సరే కొండపల్లి.. స్వయంగా కార్యకర్తలకు, గ్రామ స్థాయి నేతలకు ఫోన్ లు చేసారు. తానే వారధిలా వ్యవహరించారు మంత్రి.
Also Read : ప్రియాంక మూడేళ్ళు బలి.. రాజమౌళి ప్లానింగ్ అదే
ఈ కార్యక్రమంలో మొత్తం 800 మంది రక్తదానం చేసారు. 700 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, రోటరీ క్లబ్, ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లు, రెడ్ క్రాస్ ఇలా దాదాపు ఆరు సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో జిల్లా నాయకత్వం విఫలమైంది. ఇంత ఘనంగా కార్యక్రమాలు నిర్వహించినా సరే మీడియాలో కూడా హడావుడి జరగకపోవడం గమనార్హం. ఇదే కార్యక్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన సందర్భంగా 27 మంది విద్యార్ధులను దత్తత తీసుకున్నారు నేతలు.