తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే టాపిక్… అదే ప్రభుత్వాల మార్పు… ఏపీలో జనసేన ప్రభుత్వం… తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని సోషల్ మీడియాలో ఒకటే పుకార్లు. వాస్తవానికి రెండు అసాధ్యమే అనేది అందరరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకో ఈ కన్ఫ్యూజన్ అంటే మాత్రం… మాట అనేస్తే సరిపోతుంది కదా అనేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం ఏపీలో టీడీపీలో, జనసేనలో పెద్ద దుమారం రేపుతోంది. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర లేపింది.
Also Read : లోకేష్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..!
ఏపీలో డిప్యూటీ సీఎం పదవిపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఎదురుగానే ప్రతిపాదన చేశారు. దీంతో ఈ అంశం పెద్ద దుమారంగా మారింది. చివరికి పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఎవరైనా సరే.. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. ఇక మంత్రి టీజీ భరత్ అయితే నేరుగా చంద్రబాబు ఎదురుగానే లోకేష్‌ను సీఎం చేయాలనేశారు. దీంతో మరోసారి అలా అనొద్దు అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు కూడా. అయితే ఇదే సమయంలో జనసైనికులు కూడా తమ నోటికి పని చెప్పారు. లోకేష్‌ను డిప్యూటీ చేస్తే… పవన్‌ను సీఎం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అలా చేస్తే తప్పేంటి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణకు చెందిన జనసేన నేత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓయూ జేఏసీ నేత, వైరా నియోజకవర్గం జనసేన నేత ఇంఛార్జ్ సంపత్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లోనే సీఎం కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ విశ్వసనీయ వర్గాల వచ్చిన సమాచారం అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read : ప్రియాంక మూడేళ్ళు బలి.. రాజమౌళి ప్లానింగ్ అదే
ఇక తెలంగాణలో కూడా త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కామెంట్ చేశారు. అది కూడా 45 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందంటూ గడువు కూడా పెట్టారు. అయితే పార్టీలో ఉన్నదే 8 మంది ఎమ్మెల్యేలు…. పైగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కానీ రమణారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లో తెలియటం లేదంటున్నారు కమలం పార్టీ పెద్దలు. వాస్తవానికి రెండు ప్రభుత్వాలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది. ఈలోపే అధికార మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశం స్థానిక సంస్థల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.