Friday, September 12, 2025 10:35 PM
Friday, September 12, 2025 10:35 PM
roots

లోకేష్‌కు అదిరిపోయే బర్త్‌ డే గిఫ్ట్..!

మంత్రి నారా లోకేష్‌ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే… ఇలాంటి బహుమతి ఎవరూ ఇవ్వలేరు కూడా. ఇంతకీ ఈ కానుక ఇచ్చింది ఎవరో తెలుసా… ముంబై మెజిస్ట్రేట్ కోర్టు. అదేంటి… ముంబై కోర్టు లోకేష్‌కు పుట్టిన రోజు కానుక ఇవ్వడం ఏమిటనే కదా అనుమానం. చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబై మేజిస్ట్రేట్ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అన్నదానాలు, రక్తదానాలతో పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నారు.

Also Read: గేట్స్-బాబు మీట్.. నేషనల్ మీడియా హడావుడి…!

ఇవన్నీ ఒకెత్తు అయితే… వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు లోకేష్‌ను టార్గెట్ చేశారు ఆ పార్టీ నేతలు. అనకూడని మాటలన్నీ అనేశారు. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అయితే సినిమాలు కూడా తీశాడు. సినిమాలో పాత్రను క్రియేట్ చేసి మరీ లోకేష్ క్యారెక్టర్‌ను కించపరిచేలా చిత్రీకరించాడు. ఇక ఎన్నికల సమయంలో అయితే జగన్‌ను మద్దతుగా, చంద్రబాబు, పవన్‌, లోకేష్‌కు వ్యతిరేకంగా గంటకో ట్వీట్ పెట్టారు. ముద్ద పప్పు అంటూ వెకిలి కామెంట్లు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు కూడా. అయితే దేనికైనా సరే సమయం రావాలి కదా అంటూ లోకేష్ గతంలో వ్యాఖ్యానించారు. దీంతో అంతా సైలెంట్ అయ్యారు.

Also Read: “గెలిపించు తల్లి” ఒత్తిడితో కాళీ గుడికి గంభీర్

ఇక ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి.. గతంలో రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపారు. వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు ఒప్పందం చేసుకుని… కేవలం రూ.1.15 కోట్లు మాత్రమే పంపారని… మిగిలిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. ఇదే సమయంలో వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ ఫోటో పోస్ట్‌ చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో నోటీసులు తీసుకోకుండా వర్మ తప్పించుకున్నారు. దీంతో వర్మపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే మాట బలంగా వినిపించింది.

Also Read: బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు

ఇలాంటి సమయంలోనే వర్మకు 3 నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో 3 నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని లేదంటూ 3 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తీర్పుతో ఇప్పుడు టీడీపీ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా లోకేష్ పుట్టిన రోజు నాడే ఈ తీర్పు రావడం సంతోషంగా ఉందంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్