Sunday, September 20, 2026 01:29 PM
Sunday, September 20, 2026 01:29 PM

బైరాపై దాడి.. దేవర రియాక్షన్ ఇదే

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతుంది. ఒక స్టార్ హీరో ఇంట్లోకి దొంగతనానికి అంత ఈజీగా ఎలా అడుగుపెట్టి ఉండవచ్చు అనేది ఇప్పుడు పోలీసులను కూడా విస్మయానికి గురిచేస్తుంది. వాస్తవానికి సైఫ్ అలీఖాన్ తో పాటుగా స్టార్ హీరోలు అందరికీ ముంబై పోలీసులు భారీ భద్రత కల్పిస్తూ ఉంటారు. సల్మాన్ ఖాన్ ను ప్రముఖ గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ చేయడంతో స్టార్ హీరోల విషయంలో అలాగే యాక్టర్ల విషయంలో కూడా ముంబై పోలీసులు అలెర్ట్ గా ఉంటున్నారు.

Also Read : స్పీకర్లకు నిప్పుపెట్టేస్తున్న తమన్.. దండం రా దూత…!

ఇక హీరోల ఇంటి చుట్టూ కెమెరాలతో పాటుగా నిత్యం నిఘా ఉంటుంది. అలాంటిది ఒక దుండగుడు దొంగతనం కోసం హీరో ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాడనే దానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. వెన్నుముక పక్కన లోతుగా గాయం అయినట్లు గుర్తించారు. ఈ దాడి వెనుక ఏమైనా గ్యాంగ్ లు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

Also Read : బుక్ మై షో కింగ్ బాలయ్య.. రికార్డ్ బుకింగ్స్

సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి బాధాకరమని.. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి దేవర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. చికిత్స తర్వాత వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే అవకాశం ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్