టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రాబోయే ఇంగ్లాండ్ పర్యటనపై దృష్టి సారించాడు. జూన్ లో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనలో ఎలాగైనా సరే రాణించి తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ విషయంలో కోహ్లీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పదేపదే అదే బంతికి వికెట్ పారేసుకోవడం పట్ల అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. సీనియర్ ఆటగాడైన కోహ్లీ ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కనీసం ప్రయత్నం చేయడం లేదని ఆరోపణలు కూడా వినిపించాయి.
Also Read : ఫార్ములా ఈ రేస్ తో వైసీపీకి లింకులు..?
ఇక జూన్ లో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆ టూర్ విషయంలో ఇప్పటి నుంచే విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో మొదలు కాబోయే ఇంగ్లాండ్ కౌంటి సీజన్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్ ఆడే విషయంలో కోహ్లీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. 2012 తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సీరిస్ కోసం తన లోపాలను నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
Also Read : రేవంత్ ను జాగ్రత్తగా తిట్టిన కేటిఆర్…!
ఇంగ్లాండ్ కౌంటి సీజన్ కోసం ఒక ప్రముఖ జట్టుతో ఇప్పటికే కోహ్లీ ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. మే నుంచి ఇంగ్లాండ్ లో క్రికెట్ సీజన్ మొదలుకానుంది. దీనితో తన ఆట తీరుని మెరుగుపరుచుకునేందుకు కోహ్లీ వేసవిలో జట్టు కంటే ముందే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఐపిఎల్ సీజన్ ఉండటంతో కోహ్లీ ఎంతవరకు వెళతాడు అనే దానిపై కూడా సందిగ్ధత నెలకొంది. కనీసం ఇంగ్లాండ్ టూర్ మొదలయ్యే లోపు మూడు మ్యాచ్ లు అయినా అక్కడ ఆడాలని కోహ్లీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఐపిఎల్ కు కొన్ని మ్యాచ్ లు కోహ్లీ దూరమయ్యే ఛాన్స్ కూడా కనపడుతుంది.