Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

ఆస్ట్రేలియాపై పంత్ వైలెంట్ రివెంజ్

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ఆస్ట్రేలియా బౌలర్లకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో చుక్కలు చూపించాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని బౌండరీ దాటించడం లక్ష్యంగా ఉతికి ఆరేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో తన శరీరాన్ని టార్గెట్ చేస్తూ బంతులు విసిరిన ఆస్ట్రేలియా బౌలర్లపై కక్ష తీర్చుకున్నాడు. స్టార్ బౌలర్ అయిన కొత్త బౌలర్ అయిన సిక్స్ కొట్టడమే లక్ష్యంగా పంత్ బ్యాటింగ్ సాగింది. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగిన పంత్ వచ్చిన మొదటి బంతి నుంచే విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు.

Also Read : గంభీర్.. దయచేసి తప్పుకో

మొదటి బంతిని ఫ్రెంట్ కు వచ్చి స్ట్రైట్ సిక్స్ కొట్టిన పంత్ ఆ తర్వాత నుంచి చెలరేగిపోయాడు. తన సహజ ఆటతీరుతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ స్టార్క్ బౌలింగ్లో కొట్టిన రెండు సిక్సులు ఈ మ్యాచ్ కి హైలెట్ గా నిలిచాయి. పంత్ ఆటను ఆస్ట్రేలియా అభిమానులు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. మైదానం నలుమూలల ఫోర్లు సిక్స్లు పడుతూ అభిమానులను అలరించాడు ఈ ఢిల్లీ ఆటగాడు. ఈ సీరిస్ లో పంత్ తన స్థాయికి తగ్గట్టు ఎక్కడా ఆడలేదు.

Also Read :బూమ్రాకు గాయం..? బౌలింగ్ పై క్లారిటీ అప్పుడే…!

దీనితో పంత్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఒకానొక దశలో అతన్ని చివరి టెస్టుకు పక్కన పెడతారనే వార్తలు కూడా షికారు చేశాయి. కానీ భారత్ తరఫున ఈ టెస్ట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు పంత్ ఒక్కడే. పిచ్ కఠినంగా ఉన్నా సరే బంతి పడటం ఆలస్యం బౌండరీ బాధాలి అనే లక్ష్యంతోనే ఆడాడు. బోలాండ్ బౌలింగ్లో తొలి సిక్స్ కొట్టిన తర్వాత ఫీల్డింగ్ ప్లేస్మెంట్ విషయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పలు మార్పులు చేశాడు. బౌండరీ లైన్ వద్ద భారీగా ఫీల్డర్లను మోహరించాడు. అయినా సరే లాభం లేకపోయింది. కీలకమైన ఈ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో డిఫెన్స్ ఆడిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చాన్స్ తీసుకోలేదు. దీనితో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళకి ఆస్ట్రేలియాలో చుక్కలు చూపించావు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. కేవలం 31 బంతుల్లో 60 పరుగులు చేసిన పంత్ నాలుగు సిక్స్ లు ఆరు ఫోర్లు బాధాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్