టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను తప్పించాలి అనే డిమాండ్ ఇప్పుడు బలంగా వినపడుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు విఫలం కావడంపై గంభీర్ టార్గెట్గా సోషల్ మీడియాలో విమర్శల వేడి పెరిగింది. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం అలాగే గంభీర్ పని తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి కీలకమైన సమయంలో వికెట్లు చేజార్చుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కేవలం 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోవడం పై బీసీసీఐ పెద్దలు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
Also Read : దావోస్ లో ఏపీ స్పెషల్ అట్రాక్షన్.. కేంద్రం ఫుల్ సపోర్ట్
ఇక ఆటగాళ్లు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులు ఆడే విషయంలో ఇబ్బందులు పడుతుంటే గంభీర్ దానిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. యువ ఆటగాళ్లకు సరైన ప్రోత్సాహం లేదని కోచ్ నుంచి కెప్టెన్ కు సహకారం లేదని నేషనల్ మీడియా కూడా మండిపడుతోంది. న్యూజిలాండ్ సీరియస్ ఓటమి నుంచి పెర్త్ టెస్ట్ విజయంతో బయటకు వచ్చినట్టు కనపడిన భారత జట్టు ఆ తర్వాత మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమైంది మూడో టెస్ట్ లో వర్షం కారణంగా డ్రా తో బయటపడింది.
Also Read : ఆస్ట్రేలియా ఆటగాళ్ళ అతి.. బూమ్రా షాకింగ్ రిప్లై
ఇక కీలకమైన ఐదవ టెస్టులో ఇప్పుడు ఎంతవరకు రాణిస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది భారత్. దేనితో కోచ్ గౌతమ్ గంభీర్ తన పదవికి రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సిడ్నీ టెస్ట్ ఓడిపోతే ఖచ్చితంగా గంభీర్ ను పక్కన పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. తిరిగి కోచ్ గా ద్రావిడ్ ను తీసుకురావాలని లేదంటే వివిఎస్ లక్ష్మణ్ ను పూర్తిస్థాయి కోచ్గా నియమించాలని కోరుతున్నారు.