Saturday, September 13, 2025 03:13 AM
Saturday, September 13, 2025 03:13 AM
roots

చిల్లర ప్రవర్తన.. మరోసారి ప్రూవ్ చేసుకున్న ఆసిస్

మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు చివరి రోజు ప్రదర్శించిన వైఖరి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా జట్టు ఆటగాడు శ్యామ్ కొన్స్తాస్ వికెట్ల వద్ద చేసిన హడావుడి పై తీవ్ర స్థాయిలో మాజీ ఆటగాళ్లు ఫైర్ అవుతున్నారు. తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఈ యువ ఆటగాడు భారత ఆటగాళ్ళను రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడమే కాకుండా పదేపదే విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ మైదానంలో చేసిన కొన్ని చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : ముందు ఎమ్మెల్సీ.. తర్వాతే మంత్రి : పవన్ కళ్యాణ్

తొలి టెస్ట్ ఆడుతున్న సంతోషంలో ఉన్న కొన్స్తాస్ సీనియర్ ఆటగాళ్లు అనే గౌరవం లేకుండా కూడా ప్రవర్తిస్తున్నాడు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నోటికి ఎక్కువగా పని చెప్పాడు. అలాగే రిషబ్ పంత ను అవుట్ చేసిన తర్వాత ట్రావిస్ హెడ్ సెలబ్రేట్ చేసుకున్న విధానం కూడా వైరల్ అవుతుంది. అత్యంత జుగుప్సాగరంగా హెడ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : దీనెవ్వ తగ్గెదే లే.. తెలుగోడి సత్తా..!

అలాగే సీనియర్ ఆటగాడు లబుషేన్ కూడా మైదానంలో ఇలాగే ప్రవర్తించాడు. భారత వికెట్లు పడుతున్న సమయంలో స్టంప్స్ వద్ద పిచ్చి అరుపులు అరుస్తూ భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ముఖ్యంగా హెడ్ సెలబ్రేషన్ పైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీనియర్ ఆటగాడు అయిన హెడ్ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీమిండియా యాజమాన్యం ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. అలాగే కొన్స్తాస్ వ్యవహారంపై కూడా భారత ఆటగాళ్లు మేనేజ్మెంట్ తో చర్చిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్