ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులు ఎప్పటి నుంచి అనేది అటు ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా పండుగ సెలవుల కోసం విద్యార్థులు, టీచర్లు ఎదురు చూస్తారు. వారం రోజుల సెలవు కోసం చాలా ప్లాన్ చేసుకుంటారు కూడా. సాధారణంగా సంక్రాంతి పండుగ సెలవులు వారం రోజుల పాటు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది సెలవులపై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. సెలవులు తగ్గించారని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కూడా.
Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!
ఈ పుకార్లకు ఏపీ విద్యాశాఖ అధికారులు బ్రేక్ కొట్టారు. సంక్రాంతి పండుగ సెలవులు ఎప్పటి నుంచో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సంక్రాంతి పండుగ ప్రతి ఏటా 13, 14, 15 తేదీల్లో రావటం జరుగుతుంది. ఆయా తేదీలు వచ్చిన వారాలను లెక్కలోకి తీసుకుని వారం రోజుల పాటు సెలవు ఇస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం సంక్రాంతి పండుగ సెలవులు ఏకంగా పది రోజులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరులో వైకుంఠ ఏకాదశి పండుగ వస్తుంది. అయితే ఈసారి మాత్రం అధిక మాసం కారణంగా వైకుంఠ ఏకాదశి పండుగ జనవరి 10వ తేదీ వచ్చింది. ఇది ఉపాధ్యాయులకు కలిసివచ్చింది. 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 11వ తేదీ రెండో శనివారం వచ్చింది. ఇక 12వ తేదీ ఆదివారం నుంచి మళ్లీ ఆదివారం వరకు సంక్రాంతి పండుగ సెలవులు. అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఉంటాయని ఎన్నీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు.
Also Read : ఏపీలో గవర్నమెంట్ క్రికెట్ అకాడమీలు.. న్యూ క్రీడా పాలసీ ప్లాన్ ఇదే
2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని కృష్ణారెడ్డి వెల్లడించారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.