సంక్రాతికి మార్కెట్ యార్డ్ కమిటీ ల నియామకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వనున్నారు. క్షేత్ర స్థాయిలో 10 వేల పదవులు దక్కే అవకాశం ఉంది. కూటమి నేతలకు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి ఇవ్వనున్నారు. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
Also Read : మిస్టర్ జగన్ రెడ్డీ….నోరు అదుపులో పెట్టుకో : ఏబీ వెంకటేశ్వరరావు
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ దాదాపు 10వేల పదవులు క్షేత్రస్థాయి నేతలకు పదవులు కట్టబెడతారు. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉండగా వీటిలో ఒక్కోదానికి చైర్మన్‌తో పాటుగా ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడం ద్వారా మొత్తం 6,900 మందికి అవకాశం దక్కనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.
ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు చంద్రబాబు అప్పగించారు. రెండోదశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమించనున్నారు. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్ చేయనున్నారు. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీ చేయనున్నారు.
Also Read : కర్ణాటక కాంగ్రెస్ మంత్రికి భారీ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా…?
రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమిస్తారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉండగా ఒక్కో కమిటీలో చైర్మన్ తో కలిపి 15 మంది సభ్యులను నియమించనున్నారు. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. రొటేషన్‌లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్‌లో ఉన్న చైర్మన్ పదవులు జనరల్ కానున్నాయి. ఇప్పుడు జనరల్‌లో ఉన్నవి రిజర్వేషన్‌లోకి రానున్నాయి.