Saturday, September 13, 2025 02:50 AM
Saturday, September 13, 2025 02:50 AM
roots

జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ పొడి రోజుకో స్పూన్ తినండి చాలు

అందంగా కనిపించేందుకు జుట్టు చాలా ముఖ్యం. జుట్టు ఒత్తుగా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తాం. అయితే జుట్టు పెరిగేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలి. చాలా రకాల జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ కాలంలో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా.. జుట్టు సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యంతోపాటుగా.. తినే ఆహారం కూడా జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకుంటే.. జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.

Also Read: వర్మపై ఏపీ సర్కార్ రివేంజ్…?

జుట్టు ఎదుగుదలను పెంచుకునేందుకు రకరకాల హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే పొడి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే కేవలం పైపై పూతలే కాకుండా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తింటే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Also Read : నేను సీఎం గా ఉండగా మీ ఆటలు సాగవు.. టాలీవుడ్ కు రేవంత్ స్ట్రోక్

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం గింజలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు గుమ్మడి గింజలు, అర కప్పు వాల్ నట్స్, అర కప్పు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ ను విడివిడిగా వేయించుకుని చల్లార పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలు అన్నిటిని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని మీరు నేరుగా తినొచ్చు లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు.

Also Read: అరెస్టు వెనుక ఇంత ప్లాన్ ఉందా…!

రోజుకు ఒక స్పూన్ చొప్పున ఈ పొడిని తీసుకుంటే అందులో ఉండే విటమిన్ ఈ, విటమిన్ బి, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ పొడి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. నిత్యం ఈ పొడిని తీసుకుంటే జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది. హెయిర్ సూపర్ స్ట్రాంగ్ గా కూడా మారుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు సంగతి ఎలా ఉన్నా.. ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి కొన్ని రోజులు ప్రయత్నిస్తే తప్పేముంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్