Friday, September 12, 2025 10:35 PM
Friday, September 12, 2025 10:35 PM
roots

రాహుల్ కు గాయం.. తప్పుకుంటే భారత్ కు చుక్కలే…!

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ ఈనెల 26వ తారీకు నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఏ మేరకు ప్రదర్శన చేస్తుంది అనే దానిపై అభిమానులు ఒకరకంగా సందిగ్ధంలోనే ఉన్నారు. మొదటి టెస్ట్ లో మంచి విజయం సాధించిన భారత్… రెండు మూడు టెస్టుల్లో బాగా ఇబ్బంది పడింది. రెండో టెస్టులో ఓటమి తర్వాత మూడో టెస్ట్ లో మంచి ప్రదర్శన చేస్తుందని చాలామంది ఆశించారు. అయితే లోయర్ ఆర్డర్ కారణంగా ఓటమి నుంచి తప్పించుకుంది.

Also Read : అశ్విన్ విషయంలో రోహిత్ వర్సెస్ గంభీర్…?

వర్షం కూడా భారత్ ను ఒక రకంగా కాపాడిందని చెప్పాలి. మెల్బోర్న్ లో జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్ విషయంలో భారత్ కాస్త పట్టుదలగానే కనబడుతోంది. గత 12 ఏళ్లలో బాక్సింగ్ డే టెస్ట్ లో ఎప్పుడూ భారత్ ఓడిపోలేదు. దీనితో భారత ఆటగాళ్లు మరింత పట్టుదలగా ఉన్నారు. ఈ తరుణంలో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి చేతికి రాహుల్ కు గాయం అయింది. గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం కచ్చితంగా అతను తుదిజట్టుకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి.

Also Read : నేను సీఎం గా ఉండగా మీ ఆటలు సాగవు.. టాలీవుడ్ కు రేవంత్ స్ట్రోక్

అదే జరిగితే మెల్బోర్న్ లో భారత్ ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. ఈ సిరీస్ లో 294 పరుగులతో రాహుల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. దీనితో అతను గనుక తుది జట్టుకు దూరమైతే ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా మైదానాలపై రాహుల్ చేస్తున్న ప్రదర్శన చూస్తున్న అభిమానులు రాహుల్ త్వరగా కోలుకోవాలని… మెల్బోర్న్ టెస్ట్ లో కచ్చితంగా రాహుల్ ఆడాలని కోరుతున్నారు. అయితే రాహుల్ గాయం పై ఇప్పటివరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్