తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ కు ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ నేడు మధ్యాహ్నం కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేసారు ఏసీబీ అధికారులు. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చారు అధికారులు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపారు. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.
Also Read : ఏపీ ట్రాఫిక్ రూల్స్ చేంజ్.. ఫైన్ కట్టకపోతే సీజ్.. సీసీ కెమెరా ఫైన్లకు బ్రేక్…?
13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేసారు. ఇప్పటికే కేటిఆర్ ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీనితో కేటిఆర్ ను ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు. ఈ కేసుకు సంబంధించి విదేశాలకు డబ్బు పంపారు అనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసాయి. ఇదే అంశానికి సంబంధించి అటు కేంద్ర పెద్దల అనుమతి కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు.
Also Read : ఫైబర్ నెట్ లో దారుణాలు.. జీవీ రెడ్డి సంచలన కామెంట్స్
ఇప్పటికే ఈ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర దుమారమే రేగుతోంది. తనను అరెస్ట్ చేయాలని పదే పదే కేటిఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఆయన ఆరోపణలు కూడా చేసారు. ఇక అరెస్ట్ కావడమే మంచిదనే భావనలో కూడా బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సెంటిమెంట్ కలిసి వస్తుందని గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ సీఎంలు అయ్యారని బీఆర్ఎస్ నేతల నమ్మకం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లాన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.