తెలంగాణ మంత్రులు జగన్ పై ప్రేమ చూపిస్తున్నారా…? అమరావతిని అలాగే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడటం ఉద్దేశాలు వైయస్ జగన్ పై ఉన్న ప్రేమేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు వైఎస్ జగన్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వీళ్లిద్దరూ కారణమనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. వైయస్ జగన్ కు వీళ్ళిద్దరూ రహస్యంగా సహకరిస్తున్నారని… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అప్పట్లో వీళ్ళ కెసిఆర్ తో లాలూచి పడ్డారనే ఆరోపణలు కూడా వినిపించాయి.
Also Read : శిరీష చేసింది నేరం అయితే మీరు చేస్తున్నది ఏంటి..?
అప్పట్లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అదే అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ ఘాట్ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ పై ప్రేమ ఉంటే చూసుకోవాలని అంతేగాని ఎన్టీఆర్ ఘాట్ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరగలేవు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వైఎస్ జగన్ పై పరోక్ష ప్రేమ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
అమరావతి మునిగిపోయిందని విజయవాడ వరదల తర్వాత అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదంటూ కామెంట్స్ చేశారు. అందుకే హైదరాబాద్ బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం భారీగా అభివృద్ధి చెందుతుంది అంటూ కామెంట్స్ చేశారాయన. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు అమరావతిపై కుళ్ళు కాదని వైయస్ జగన్ ఓడిపోయారు అనే బాధ పొంగులేటిలో ఉందని అందుకే ఆ కామెంట్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read : నానీని కాపాడుతుంది ఎవరూ…? తిట్టినా పౌరుషం రాదెం…?
పొంగులేటి జగన్ బినామి అంటూ ఫైర్ అవుతున్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈ తరహా కామెంట్స్ మంచిది కాదని జగన్ పై అంత ప్రేమ ఉంటే రాజకీయాలు మానేసి తాడేపల్లి ప్యాలెస్ లో సేవ చేసుకుంటూ బతకాలని మంత్రి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఎన్టీఆర్ అభిమానులు, హైదరాబాదులో సెటిల్ అయినా ఆంధ్ర ప్రాంత వాసులు కచ్చితంగా మంత్రులకు బుద్ధి చెప్పడం ఖాయం అంటూ హెచ్చరిస్తున్నారు.