Saturday, September 13, 2025 07:03 AM
Saturday, September 13, 2025 07:03 AM
roots

క్రికెట్ కు సైంటిస్ట్ గుడ్ బై… మిస్ యూ అశ్విన్

టీం ఇండియా స్పిన్ దిగ్గజం ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. బుధవారం బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తర్వాత ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి… అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో అశ్విన్ అడిలైడ్‌లో రెండో మ్యాచ్ ఆడాడు. అయితే బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో అతని స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చాడు.

Also Read : ఆస్ట్రేలియా పిచ్ లపై “హ్యాండ్సం బ్యాటింగ్” కెఎల్ రాహుల్ టెక్నిక్ కు ఫ్యాన్స్ ఫిదా

అశ్విన్ 106 టెస్ట్ లు ఆడి… 537 వికెట్ లు తీసాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా క్రికెట్ నుంచి నిలిచాడు అశ్విన్. అతని కంటే ముందు అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీసి భారత్ తరుపున మొదటి స్థానంలో నిలిచాడు. 38 ఏళ్ల అశ్విన్ అడిలైడ్‌లో డే-నైట్ టెస్టు ఆడి ఒక వికెట్ తీశాడు. పింక్ బాల్ టెస్ట్ లో భారత్ తరుపున అత్యధిక వికెట్ లు తీసిన బౌలర్ అశ్విన్. ఈ ప్రకటనకు ముంది డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు అశ్విన్.

Also Read : ఆస్ట్రేలియా విజయాన్ని లాగేసుకున్న ఆకాష్… బూమ్రా

ఆ సందర్భంగా బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, చేతేశ్వర్ పుజారా తన బౌలింగ్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్నారని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. నవంబర్ 6, 2011న ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసాడు అశ్విన్. బ్యాటింగ్ లో కూడా విలువైన ఇన్నింగ్స్ లో ఆడాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్ తో జరిగిన సీరీస్ లో సెంచరీ కూడా చేసాడు. 2016లో భారత్ తరఫున 12 టెస్టుల్లో అశ్విన్ 72 వికెట్లు తీసుకున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్