ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారులు, ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అవినీతి చేసిన వైసిపి నాయకులను కొంతమంది కాపాడుతున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం అలాగే కృష్ణా జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కూడా నానిని కాపాడేందుకు ప్రయత్నాలు చేయడం చూసి చాలామంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నాని సాక్షాలతో దొరికిపోయారు.
Also Read ; సోషల్ మీడియాను ఊపేస్తున్న చంద్రబాబు, పవన్
అయినా సరే ఇప్పటివరకు నానిని గాని ఆయన కుటుంబ సభ్యులను గాని అరెస్టు చేయలేదు. ఇక నాని తప్పించుకునే విధంగా జిల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక అదే నియోజకవర్గానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర కూడా నాని విషయంలో అసలు ఏమి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. అలాగే కృష్ణాజిల్లా నాయకులు గానీ, కృష్ణా జిల్లాకు సంబంధించి బందరు ఎంపీ గాని లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులు మంత్రులు గాని ఎవరూ కూడా నాని విషయంలో నోరు తెరిచే ప్రయత్నం ఎక్కడా చేయడం లేదు.
Also Read ; వై నాట్ పులివెందుల… వర్కవుట్ అవుతుందా…?
ఒకప్పుడు నాని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేవారు. ప్రతి నాయకుడిని ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలా ఎవరిని పేర్ని నాని వదిలిపెట్టలేదు. అయినా సరే ఆయన విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం చాలామందిని ఆశ్చర్యం కంటే బాధపెడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పే ఇప్పుడు అవినీతి చేసినట్టు అడ్డంగా దొరికిన వాళ్ళ విషయంలో అలా ఎలా వ్యవహరిస్తున్నారంటూ చాలామంది షాక్ అవుతున్నారు.