Saturday, September 13, 2025 12:48 PM
Saturday, September 13, 2025 12:48 PM
roots

ఆస్ట్రేలియా విజయాన్ని లాగేసుకున్న ఆకాష్… బూమ్రా

ఆస్ట్రేలియా బౌలింగ్ చూస్తుంటే భారత్ లంచ్ సమయానికి ఆల్ అవుట్ కావడం ఖాయమని అందరూ అంచనా వేసారు. ఈ రోజే దాదాపుగా మ్యాచ్ ముగిసిపోతుందని వర్షమే భారత్ ను కాపాడాలని పూజలు కూడా చేసారు. కాని భారత్ పోరాటం చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మంచి స్వింగ్ లో ఉన్న రాహుల్ ను అవుట్ చేస్తే భారత ఇన్నింగ్స్ త్వరగా అయిపోతుందని, భారత్ బ్యాటింగ్ కు మళ్ళీ వస్తుందని ఫాలో అన్ లోపు అవుట్ చేయాలని అంచనా వేసాడు ఆసిస్ కెప్టెన్ కమ్మిన్స్.

Also Read : మావ పాలన మరిచిన అల్లుడు.. సభ నిర్వహణపై పెద్ద పెద్ద మాటలు

కాని రాహుల్ అవుట్ అయిన తర్వాత జడేజా, నితీష్ రెడ్డి ఇద్దరూ ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అప్పుడప్పుడు పరుగులు చేసినా… అసలు వికెట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. నితీష్ ఒక్కడే 11 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసాడు. జడేజా ఒకరకంగా గోడ కట్టేశాడు. ఆ తర్వాత నితీష్… బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి బూమ్రా వస్తాడని అనుకున్నారు. కాని సిరాజ్ వచ్చాడు. సిరాజ్ తక్కువ పరుగులకే అవుట్ అయినా… బూమ్రా ఆ తర్వాత జడేజాతో కలిసాడు. జడేజా 77 పరుగులకు క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు.

Also Read : మెగా ప్లానింగ్ సూపర్… మరో స్టార్ డైరెక్టర్ ను లైన్ లో

ఇక జడేజా అవుట్ తో ఆస్ట్రేలియా పండగ చేసుకుంది. మరో పది నిమిషాల్లో భారత ఇన్నింగ్స్ ముగిసిపోతుందని అంచనా వేసారు. కాని బూమ్రా, ఆకాష్ దీప ఇద్దరూ కూడా తమ వికెట్ ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. భారత్ ను ముందు ఫాలో ఆన్ గండం నుంచి బయటకు తీసుకు రావాలని ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ మంచి షాట్ లు ఆడాడు. ఆకాష్ దీప్ బ్యాటింగ్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ మైండ్ బ్లాక్ అయింది. కమ్మిన్స్ ఓవర్లో 6, 4 కొట్టి ఫాలో ఆన్ నుంచి బయటకు లాగాడు. ఇలా ఈ ఇద్దరూ అద్భుతమైన ఆట తీరుతో ఆసిస్ జట్టుకు విజయాన్ని దూరం చేసారు. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న ఈ ఇద్దరూ మరో గంట సేపు బ్యాటింగ్ చేసినా ఆస్ట్రేలియాకు కచ్చితంగా అది మైనస్ కానుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్