Saturday, September 13, 2025 12:18 PM
Saturday, September 13, 2025 12:18 PM
roots

శిరీష చేసింది నేరం అయితే మీరు చేస్తున్నది ఏంటి..?

రెండు రోజుల క్రితం నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ వ్యవహారం ఇప్పుడు ఆయన మనవరాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మెడకు చుట్టుకుంటుంది. విగ్రహావిష్కరణను అత్యంత ఘనంగా నిర్వహించడం వరకు బాగానే ఉంది. అయితే అక్కడి నాయకులు పంపిన కొన్ని ఆహ్వానాలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కు తలనొప్పిగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథి అలాగే గౌతు శిరీష తో పాటుగా వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఒకే వాహనంపై కనబడటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Also Read : వై నాట్ పులివెందుల… వర్కవుట్‌ అవుతుందా…?

కార్యకర్తల్లో కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీని పై సోషల్ మీడియాలో నిన్న ఉదయం నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ విషయంలో గౌతు శిరీష తప్పు ఏమీ లేదని స్థానిక నాయకుల అభిప్రాయం.  అక్కడ కార్యక్రమ నిర్వాహకులు గౌడ సామాజిక వర్గం వారు కావడంతో జోగి రమేష్ ను కూడా ఆహ్వానించారని.. పలువురు ఇప్పటికే దీనిపై వివరణలు కూడా ఇచ్చారు. మంత్రి పార్థసారథి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ కూడా చెప్పారు కూడా. ఈ విషయంలో తనకు ఏ సంబంధం లేదని, కావాలని తన ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అధినాయకత్వానికి గౌతు శిరీష క్షమాపణ కూడా చెప్పారు. జరిగింది పొరపాటే తప్ప.. కావాలని చేసింది కాదని, ఒక అతిధిగా తనకున్న పరిధిలో తాను వ్యవహరించాను తప్ప, చేయగలిగింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమెను టార్గెట్ చేస్తూ కథనాలు రాయడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె వివరణతో ఆమెను అర్ధం చేసుకున్న టీడీపీ కార్యకర్తలు.. అధిష్టానం కూడా పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలని కోరుతున్నారు. ఇవే పత్రికలు, నాయకులు గతంలో చంద్రబాబును, విజయసాయి రెడ్డి కలిసి పక్కపక్కన కుర్చుని ఫోటోలు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నందమూరి సుహాసిని తన కొడుకు వివాహానికి కొడాలి నాని ని ఆహ్వానిస్తే ఎందుకు మాట్లాడలేదని…? ఎన్నికల ముందు వైసీపీ నేతలకు టికెట్ లు ఇచ్చి పార్టీలోకి తీసుకుంటే ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రుల అవినీతి సాక్ష్యాలు ఉన్నా ఇప్పటి వరకు వాళ్ళను ఎందుకు, ఎవరు కాపాడుతున్నారో చెప్పాలని సవాల్ చేస్తున్నారు.

Also Read : సార్… ప్లీజ్ ఆ ఆఫీసు మాకొద్దు…!

పేర్ని నానీ అడ్డంగా దొరికినా, కొడాలి నాని అవినీతి వ్యవహారాలపై సాక్ష్యాలు ఉన్నా వారి పై చర్యలు తీసుకోవడంలో ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మరియు మెగా సంస్థల పై తీవ్ర ఆరోపణలు చేసిన టిడిపి అధిష్టానం.. ఇప్పుడు అవే సంస్థలకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఏమి జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒక సిఎం హోదాలో ఉన్న చంద్రబాబు తెలంగాణాలో ప్రభుత్వం చట్ట పరంగా తీసుకున్న నిర్ణయంతో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ని పరామర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని.. మెగా కృష్ణరెడ్డి గుడి ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళారో చెప్పాలని సూటిగా అడుగుతున్నారు.

వీరందరికీ కార్యకర్తలతో పొలం గట్టు తగాదాలు ఏమీ లేవని, కేవలం తమ అధినేతను అగౌరవపరిచారనే ఒకే ఒక్క కారణంతో వారి పై కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే అలాంటి వారితో పార్టీ పెద్దలే రాసుకు పూసుకు తిరుగుతుంటే కార్యకర్తల ఆవేదన ఎలా వ్యక్తం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇక గౌతు శిరీష వ్యవహారంలో ఏదో తెలియక జరిగిన తప్పుని కొందరు కావాలనే హైలెట్ చేస్తున్నారని.. గౌతు శిరీషను కావాలని బద్నాం చేస్తున్న కొందరు నాయకులు… తాము చేసే వ్యవహారాలపై కూడా పై అంతే నిక్కచ్చిగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్