Monday, October 27, 2025 10:27 PM
Monday, October 27, 2025 10:27 PM
roots

అతకని పవన్, అల్లు అర్జున్ బంధం… కావాలనే కలవలేదా…?

మెగా ఫ్యామిలీలో విభేదాలు సమసిపోయాయి అనే ప్రచారం జరుగుతున్నా… కొన్ని పరిణామాలు చూస్తుంటే మాత్రం సీన్ అలా కనబడటం లేదని చెప్పాలి. ఆదివారం చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాడు. శనివారం అల్లు అర్జున్ ను పరామర్శించడానికి పలువురు సినీ పెద్దలు వచ్చినా మెగా కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. దీనితో వారిని గౌరవిస్తూ అల్లు అర్జున్ వారి ఇంటికి వెళ్లినట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే దీని వెనక పుష్ప సినిమా వసూళ్ళ కారణం కూడా ఉండవచ్చు అనే ప్రచారం ఉంది.

Also Read : సోషల్ మీడియాను ఊపేస్తున్న చంద్రబాబు, పవన్

అది పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ ను కలవడానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది అనే ప్రచారం కూడా ఉంది. పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ మొన్న మధ్య కాస్త సోషల్ మీడియాలో హడావుడి జరిగింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా తన అభిమానులను చూసుకుని కాస్త రెచ్చిపోయిన పరిస్థితి ఉంది.

ఈ తరుణంలో పుష్ప సినిమా విడుదల కావడం, ఆ సినిమా 1000 కోట్ల రికార్డును అధిగమించడం, తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ పరామర్శించడానికి రాకపోవడం అన్నీ కూడా సంచలనమయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ వెళ్లి అల్లు అర్జున్ ను కలిసే ప్రయత్నం చేస్తారని చాలామంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తీరా చూస్తే అల్లు అర్జున్ ను కలవకుండానే తిరిగి అమరావతి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్.

Also Read : వైసీపీ నేతలను గుండెల్లో పెట్టుకున్న టీడీపీ 

దీనితో అసలు అల్లు అర్జున్ ను కలవడం పవన్ కు ఇష్టం లేదని అందుకే చిరంజీవి ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ ఆదివారం వెళ్లలేదని అంటున్నారు. రామ్ చరణ్ ముందు కలిసే అవకాశం లేదని ప్రచారం జరిగినా చివరకు రామ్ చరణ్ బన్నీని కలిసాడు. దీనితో దాదాపుగా ఈ వివాదం ముగిసినట్లే అని భావించినా చివరకు పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో గ్యాప్ అలాగే ఉందని, పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్స్ లేదని ఇక పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ కూడా వెనక్కి తగ్గక పోవచ్చు అని మరి కొంతమంది అంటున్నారు. అయితే పుష్ప సినిమా టికెట్ ధరలను పెంచిన సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు బహిరంగ వేదికపై ధన్యవాదాలు కూడా చెప్పారు మరి ఎందుకు కలవలేదు ఏంటి అనేది మాత్రం తెలియలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్