Saturday, September 13, 2025 12:35 PM
Saturday, September 13, 2025 12:35 PM
roots

ఆస్ట్రేలియా పిచ్ లపై “హ్యాండ్సం బ్యాటింగ్” కెఎల్ రాహుల్ టెక్నిక్ కు ఫ్యాన్స్ ఫిదా

ఆస్ట్రేలియా మైదానాల్లో బ్యాటింగ్ చేయడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. పది ఓవర్ల పాటు ఒక బ్యాట్స్మెన్ నిలబడాలి అంటే పక్కా టెక్నిక్ ఉండాలి. ఆసిస్ బౌలింగ్ లైనప్ అప్పుడు ఇప్పుడు… ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఆ బౌలింగ్ లైనప్ ను ఎదుర్కొని నిలబడి బ్యాటింగ్ చేయడం ఒక సాహసం. ఈ విషయంలో కెఎల్ రాహుల్ టెక్నిక్ పర్ఫెక్ట్ గా ఉంది. అతని బ్యాటింగ్ కు విమర్శకులు సైతం ఫిదా అవుతున్నారు.

Also Read : ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్ ఉంటున్నారా..? ఇది చదివి డెసిషన్ తీసుకోండి…!

ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నా సరే రాహుల్ మాత్రం చాలా కూల్ గా కనపడుతున్నాడు. స్టార్క్, కమ్మిన్స్, హేజిల్వుడ్ ను చాలా తెలివిగా, మంచి ఫుట్ వర్క్ తో ఎదుర్కొంటున్నాడు రాహుల్. ఈ సీరీస్ ఆసాంతం రాహుల్ మంచి డిఫెన్స్ ఆడాడు. ఆస్ట్రేలియా పిచ్ లపై నిలబడితే పరుగులు అవే వస్తాయి. ఆ విషయంలో రాహుల్ తన న్యాచురల్ గేమ్ ఆడుతూ ఆసిస్ కు కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నా సరే రాహుల్ మాత్రం ఎక్కడా కంగారు పడటం లేదు.

Also Read : టెస్ట్ క్రికెట్ లో లోయేస్ట్ టార్గెట్స్ ఇవే

ఆస్ట్రేలియా అతని కోసం ఎన్నో వ్యూహాలు అమలు చేసినా ఈ కర్ణాటక ఆటగాడు మాత్రం ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. తొలి ఇన్నింగ్స్ లో 64 బంతులు ఆడిన రాహుల్… ప్రతీ బంతిని పక్కాగా అంచనా వేసి బ్యాటింగ్ చేయడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన వికెట్ కాపాడుకోవడానికి రాహుల్ ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఆసిస్ బౌలర్లకు చుక్కలు కనపడుతున్నాయి. అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, బౌన్సర్ ఇలా ఏ బంతి సంధించినా రాహుల్ మాత్రం ఎక్కడా తొందరపడకుండా బ్యాటింగ్ చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్