తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం ఏమోగానీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. పదేపదే పవన్ కళ్యాణ్… చంద్రబాబు నాయుడు పై ప్రశంసలకు కురిపించడం ఇక చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అడిగిన అంశాలపై కాస్త ఆలస్యమైనా వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయడం… ఇక వీళ్లిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకుంటే అక్కడ కనబడుతున్న కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : పరారీలో గౌతంరెడ్డి… ఎక్కడున్నాడో తెలుసా…?
ఇటీవల విజయవాడలో విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కువగా నవ్వుతూనే కనిపించారు. ఇద్దరు పలు సరదా అంశాలపై చర్చించుకోవడం వంటి సీన్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓవైపు కూటమిలో చిచ్చు పెట్టాలని వైసీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం రాజకీయాలను మించి ఉంది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహమే ఉండేది.
Also Read :బాలకృష్ణ ఇంటికి టీ సర్కార్ నోటీసులు… కూల్చేస్తారా…?
అయితే 2019 ఎన్నికల సమయంలో కాస్త అది చెడినా మళ్లీ తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ సహకారం అందించడం జనసేన పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు తనవంతు సహకారం అందించడంతో పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పాలి. ఇక ఈ వీడియోలు చూసిన కార్యకర్తలు అయితే భవిష్యత్తులో కూడా మీ స్నేహం ఇలాగే ఉండాలని ఎవరు ఎన్ని విధాలుగా చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన వారి ట్రాప్ లో పడవద్దు అంటూ కోరుతున్నారు.




