Tuesday, October 28, 2025 01:52 AM
Tuesday, October 28, 2025 01:52 AM
roots

టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?

సాధారణంగా రాజకీయ నాయకులకు సినిమా ప్రముఖులకు మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. సినిమా ప్రముఖులు… ప్రభుత్వ అధినేతలు ఎవరున్నా సరే వాళ్ళతో రాజీ కోసం లేదా సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి విషయంలో సినిమా పరిశ్రమ కాస్త ఏడాది నుంచి ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డిని దాదాపుగా నిర్లక్ష్యం చేసిందనే చెప్పొచ్చు. అందుకే కాస్త దూరం పెట్టిన పరిస్థితి ఉంది.

Also Read: బన్నీతో టీడీపీకి గొడవలున్నాయా….?

గతంలో సీఎం కేసీఆర్ తో అలాగే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తో చాలా జాగ్రత్తగా.. అత్యంత సన్నిహితంగా ఒకరకంగా సినిమా వాడిగానే చూస్తూ వచ్చారు. బీఆర్ఎస్ నేతలకు కూడా సినిమా పరిశ్రమలో చాలా మంచి ప్రాధాన్యత ఉండేది. సినిమా వాళ్ళతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు వ్యాపారాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో సినిమా పరిశ్రమ కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. దీనితో రేవంత్ రెడ్డి తాను ఏం చేయాలనేది చేస్తూ ముందుకు వెళుతున్నారు.

Also Read: ఆ మాజీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు…!

ఇక ఇప్పటినుంచి సినిమా పరిశ్రమ ఖచ్చితంగా రేవంత్ విషయంలో భయపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో సినిమా వాళ్లు అడిగిన డిమాండ్లకు, కోరిన కోరికలకు అంతు ఉండేది కాదు. తాము ఏది అడిగితే అప్పట్లో గులాబీ పార్టీ ప్రభుత్వం అది చేసి చూపించేది. సామాన్యుల గురించి ఆలోచించకుండా సినిమా వాళ్ళ కోసం చాలానే చేసింది అప్పట్లో గులాబీ పార్టీ. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో… అల్లు అర్జున్ అరెస్టుతో సినిమా వాళ్లకు గట్టిగానే క్లారిటీ వచ్చినట్టుగా కనబడుతోంది.

Also Read: జమిలీపై చంద్రబాబు హాట్ కామెంట్స్

ఇకనుంచి రేవంత్ రెడ్డి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరలు పెంచమని అడిగే పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు. అలాగే ఇన్నాళ్ళు తెలంగాణకు మాత్రమే పరిమితమైన సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు కూడా విస్తరించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలని కోరిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆనాడు సినిమా పరిశ్రమ అసలు చంద్రబాబు మాట పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.

Also Read: అండర్ గ్రౌండ్ కు పేర్ని…? భార్య కోసం త్యాగం

ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దెబ్బకు సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం కూడా ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమా వాళ్ళ విషయంలో రేవంత్ ఎక్కడా కూడా రాజీకి వెళ్లే పరిస్థితి కనపడటం లేదు. తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు సమానమే అనేది మరోసారి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశారు. నాగార్జున అక్రమ కట్టడాలపై కూడా రేవంత్ ఇదే దూకుడు ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పరిణామాలు ఉండే అవకాశం ఉంది. దీనితో ఇప్పుడు సినిమా పరిశ్రమ… రేవంత్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడవచ్చు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. సినిమా వాళ్ళ కోరికలకు ఖచ్చితంగా ఎండ్ కార్డు పడే అవకాశం ఉందనేది నిన్నటి పరిణామంతో చెప్పవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్