టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్నాళ్ళుగా ఫాంలో లేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ రాణిస్తాడని అభిమానులు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ రెండో టెస్టులో రోహిత్ దారుణంగా విఫలం అయ్యాడు. మొత్తం 9 పరుగులు మాత్రమే చేసాడు రోహిత్. మొదటి టెస్ట్ లో రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగా అతను ఆశించిన దానికంటే ఎక్కువగానే రాణించాడు. ఇక రెండో టెస్టులో శర్మ కంటే కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించాడు.
Also Read : సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం
దీనితో మళ్ళీ ఇప్పుడు రోహిత్ శర్మను ఓపెనింగ్ చేయవద్దు అనేది టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ వాదన. ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ను మళ్లీ పంపించే ఆలోచనలోనే గంభీర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై జట్టు యాజమాన్యం కూడా గంభీర్ కు సపోర్ట్ చేస్తుంది. రెండో టెస్ట్ మాదిరిగానే రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలని తన బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో చాలా ఉపయోగపడుతుందని తిరిగి ఫామ్ లోకి వస్తే రాబోయే మూడు టెస్టుల్లో అది కీలకంగా మారబోతోందని గంభీర్ కూడా టీమిండియా యాజమాన్యానికి స్పష్టంగా చెప్పాడు.
Also Read : పాపం… ఆ నెంబర్ కలిసి రావడం లేదు…!
దీనితో అటు రోహిత్ శర్మ కూడా నెట్స్ లో తీవ్రంగానే కష్టపడుతున్నాడు. కేఎల్ రాహుల్ కొత్త బంతిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు అనే విషయం మొదటి రెండు టెస్టుల్లో స్పష్టంగా అర్థమైంది. మొదటి టెస్టులో దాదాపు 300 పంతులు రాహుల్ ఎదుర్కొన్నాడు. రెండో టెస్టులో కూడా రాహుల్ సమర్థవంతంగానే ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ లో రాహుల్ ఆట అంత తీసిపోలేదు. పరుగులు చేయాలనే కసి రాహుల్ లో కనపడింది. రెండో ఇన్నింగ్స్ లో మాత్రమే ఓ చెత్త బంతికి అవుట్ అయ్యాడు. దీనితో రాహుల్ ఓపెనర్ గా కరెక్ట్ అనే అభిప్రాయాన్ని జట్టు యాజమాన్యం వ్యక్తం చేస్తోంది.