Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

ఇంకా లేట్ వద్దు… పిలిచేద్దాం అంటున్న టీడీపీ అధిష్టానం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్లీ పునర్వైభవం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడూ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిన సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగింది. అలాగే సదరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

Also Read : అంబటి… ఇక సంక్రాంతి డ్యాన్స్ వేసుకోవటమేనా..!

అయితే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గరకు రావడంతో తెలుగుదేశం పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను, పదవుల కోసం ఎదురుచూసి ఇబ్బంది పడుతున్న నేతలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ నేతలు రెడీ అయ్యారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

Also Read : వాళ్లంతా వేస్ట్… ఆ జిల్లా నేతలపై జగన్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అశ్వరావుపేట, సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఆయన మూడుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరగా చేరితే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమకు అవకాశం ఉంటుందని బిజెపి, తెలుగుదేశం పార్టీ కూటమి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయని, కాబట్టి భవిష్యత్తులో ఇది తమకు ప్రయోజనంగా ఉంటుందని సదరు నేతలు భావిస్తున్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్