మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆస్తుల గొడవ ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి జనాల్లో, అటు సినీ పరిశ్రమలో కూడా పెరుగుతోంది. అయితే మంచు కుటుంబంలో విభేదాలకు వినయ్ అనే వ్యక్తి కారణం అంటున్నాయి మోహన్ బాబు కుటుంబ సన్నిహిత వర్గాలు. అసలు ఇప్పుడు ఈ వినయ్ ఎవరు అనేది సామాన్య ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అసలు ఎవరు ఈ వినయ్ అనేది ఒకసారి చూస్తే… అతను మంచు విష్ణు వ్యాపార పార్టనర్ గా చెప్తున్నారు. విష్ణు వ్యవహారాలు అన్నీ అతనే చూసుకుంటున్నాడు.
Also Read : పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు
మంచు కుటుంబంలో గొడవలు జరిగిన ప్రతీసారి అతని పేరే బయటకు వస్తోంది. అతను మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్ గా వ్యవహరిస్తున్నాడట. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఇతనికి వైఎస్ కుటుంబానికి మధ్య మంచి అనుబంధమే ఉంది. గతంలో 2019 నుండి 2022 వరకు సాక్షి మీడియా సంస్థల సీఈఓగా బాధ్యతలు నిర్వహించాడు వినయ్. అనంతరం కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈవోగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీ తో పాటు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (నిర్మాణ సంస్థ) మేనేజింగ్ పార్ట్నర్ గా మరియు Sucstrat Consulting Private Limited కి మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను నెలలో ఒకటి రెండు రోజులు తిరుపతి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉంటాడని సమాచారం. ఆ తర్వాత ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, దుబాయ్ నగరాల్లో ఉంటాడని, అక్కడ అతనికి వ్యాపారాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
Also Read : వాళ్లంతా వేస్ట్… ఆ జిల్లా నేతలపై జగన్ ఫైర్..!
కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కూడా ఇతను కలవడానికి నిరాకరించడం అప్పట్లో సంచలనం అయింది. ఇక మంచు విష్ణు… మోహన్ బాబు యూనివర్సిటీలో అతనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడాన్ని మంచు మనోజ్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. నార్త్ ఇండియాకు చెందిన ఇతనికి నిర్వహణ బాధ్యతలు మొత్తం అప్పగించింది మంచు కుటుంబం. ఆ తర్వాత అతనే మంచు మనోజ్ ను పక్కన పెట్టినట్టు సమాచారం.