గ్లామర్ బ్యూటీలు తగ్గేదే లే అనేస్తున్నారు. అందాల అరబోతకు హద్దులు పెట్టుకోలేదు. ఒకరిని మించి మరోకరు మాయ చేస్తున్నారు. బ్యూటీల అందాల జాతరపై మీరు ఓ లుక్కేయాలంటే ఇన్ స్టా ఎక్స్‌క్లూజివ్‌లోకి ఎంటర్ కావాల్సిందే.
స్టార్ కిడ్ శృతి హాసన్ చీరకట్టులో కనిపించి కవ్వించింది. పల్చటి బ్లాక్ శారీలో పరువాల విందు చేసింది. మరోవైపు బ్యూటీఫుల్‌గా ఫొటో షూట్లు కూడా చేస్తూ అదరగొట్టింది. చీరకట్టులో మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లను కట్టిపడేసింది. అయితే సంప్రదాయ దుస్తుల్లో మెరియడమే కాకుండా.. ఫిట్ గా కనిపించి అట్రాక్ట్ చేస్తోందీ బ్యూటీ.
Also Read: తగ్గేదె లే అంటున్న మెగా – అల్లు ఫ్యామిలీస్…!
బాలీవుడ్ బ్యూటీలు సెగలు రేపుతున్నారు. ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో రెచ్చిపోయి సోషల్ మీడియాని హీటెక్కించే ముద్దుగుమ్మలు… మరోసారి తగ్గేదేలే అన్నట్లు రెచ్చిపోయారు. ఖుషీ కపూర్, అమైరా దస్తూర్, ఊర్వశీ రౌతేలా ఫోటోషూట్‌లో అదిరిపోయే ఫోజులిచ్చారు. బ్యూటీల కిల్లింగ్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మత్తెక్కించే అందాల షోతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లోనే అందాలన్నీ వడ్డించేస్తోంది. రోజు రోజుకు ఈ అమ్మడు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రెచ్చిపోతుంది. ఫోటో షూట్‌లో పరువాలన్నీ ప్రదర్శిస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా సన్ బాత్ థెరపీ అంటూ రచ్చ చేసిందీ బ్యూటీ.
Also Read: గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మలు..!
బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా మరోసారి సోయగాలు ఒలకబోసింది. గ్లామరస్ పాత్రలకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బ్యూటీ… తన పెట్స్‌తో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. తన పెట్స్‌కి కేక్ తినిపిస్తూ ఎంజాయ్ చేసిందీ బ్యూటీ. ముద్దుగుమ్మకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలో బాలీవుడ్ సెలబ్రెటీలు సందడి చేశారు. పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో కలర్ ఫుల్‌గా మెరిసిపోయారు. అదిరిపోయే ఔట్ ఫిట్స్‌తో స్టార్లు కనిపించి కనువిందు చేశారు. స్టార్ల సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.