Saturday, September 13, 2025 02:48 AM
Saturday, September 13, 2025 02:48 AM
roots

దట్ ఈజ్ రోహిత్… రాహుల్ కోసం ఓపెనింగ్ ప్లేస్ వదిలేసాడు

శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని… తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేసాడు రోహిత్. రోహిత్ కొడుకు పుట్టడంతో ఇండియాలోనే ఉండిపోయి మొదటి టెస్ట్ కు దూరమయ్యాడు. దీనితో పెర్త్ టెస్ట్ లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసాడు. రోహిత్ జట్టులోకి రావడంతో, పెర్త్‌ లో 77 పరుగులు చేసిన రాహుల్ మళ్ళీ మిడిల్ ఆర్డర్ కు వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేసారు.

Also Read : ఇండియా పింక్ బాల్ టెస్ట్ ట్రాక్ రికార్డ్ ఇదే… కంగారు పడతారా… పెడతారా..?

అయితే, మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ ఆ ఊహాగానాలకు ముగింపు పలికాడు. ఓపెనర్‌గా ఆడనని స్పష్టం చేశాడు. కెఎల్ ఇన్నింగ్స్‌ ను ఓపెన్ చేస్తాడని తాను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. నాకు ఇది చాలా కష్టమే అయినా జట్టు కోసం మంచి నిర్ణయం అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మొదటి టెస్ట్ లో దుమ్ము రేపిన ఇండియా… రెండో టెస్ట్ ను పింక్ బాల్ తో డే అండ్ నైట్ ఫార్మాట్ లో ఆడనుంది.

Also Read : షమిని ఆడించాలా వద్దా.. భయపడుతున్న గంభీర్

న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఎదురైన సిరీస్ వైట్‌వాష్ పరాభవం నుంచి భారత్ భారీ విజయంతో మళ్ళీ గాడిలో పడింది. డే-నైట్ అడిలైడ్ టెస్టు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఇక మొదటి టెస్ట్ లో లేని గిల్, రోహిత్ ఈ మ్యాచ్ లో ఆడటంతో పడిక్కల్, జురెల్ ను పక్కన పెట్టారు. ఇక గురువారం ఆస్ట్రేలియా అడిలైడ్ టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ ని ఫైనల్ చేసింది. అడిలైడ్ ఓవల్‌లో గాయపడిన జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో పేసర్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి చేర్చింది. బొలాండ్ కు భారత్ పై మంచి రికార్డ్ ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్