Tuesday, October 28, 2025 01:04 AM
Tuesday, October 28, 2025 01:04 AM
roots

మా అన్నను ఎందుకు క్షమిస్తున్నావ్ చంద్రబాబు…?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు అదాని వ్యవహారంలో పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పట్ల షర్మిల ఇప్పుడు వరుసగా వినతీపత్రాలు సమర్పిస్తూ… ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఏసీబీ కార్యాలయం వద్ద షర్మిల పంజరంతో వినూత్నంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలే చేసారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టిందని ఆమె ఆరోపించారు. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

Also Read : మరి ఇలా అయితే ఎలా సజ్జల గారు…!

అదానీ – జగన్ 1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసారు. అనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని నిలదీశారు. అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని… సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందన్న ఆమె… ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ FBI వెల్లడించిందని పేర్కొన్నారు. ఆధారాలు కూడా బయట పెట్టిందన్నారు. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? అంటూ ప్రశ్నించారు.

Also Read : ఏపీ ముఖచిత్రం మార్చేసిన 2024…!

ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ? అని దుమ్మెత్తిపోశారు. 2021 లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేశారని ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారన్నారు. రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారనన్నారు. అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసని ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు… కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా అన్నారు… అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు… నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే అన్నారు. అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుందని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్