Friday, September 12, 2025 10:54 PM
Friday, September 12, 2025 10:54 PM
roots

తగ్గేదె లే అంటున్న మెగా – అల్లు ఫ్యామిలీస్‌…!

ఆరు నెలలుగా సాగుతున్న మెగా – అల్లు యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఇందుకు పుష్పా 2 సినిమా రిలీజ్‌ సందర్భంగా జరిగిన విషయాలను సినీ, రాజకీయ విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా 2024 ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రస్తావన లేకుండానే వైసీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటు వేయాలని అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లారు. అక్కడ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు. జస్ట్‌ అలా వెళ్లి… ఇలా వచ్చాడు. అంతే… నాటి నుంచి మెగా వర్సెస్‌ అల్లు వివాదం ఓ రేంజ్‌కు చేరుకుంది. చివరికి బన్నీని మెగా ఫ్యాన్స్‌ దుమ్మెత్తి పోశారు. ఇక ఫలితాల తర్వాత ఈ వివాదానికి తెర పడుతుందని అంతా భావించారు. బన్నీ వచ్చి పవన్‌ను అభినందిస్తాడనుకున్న ప్రతి ఒక్కరికీ నిరాశే మిగిలింది. మెగా ఫ్యామిలీ చేసిన ఈవెంట్‌కు అల్లు ఫ్యామిలీ దూరంగా ఉంది.

Also Read : గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మలు..!

ఇక పుష్పా 2 రిలీజ్‌ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరవ్వలేదు. ఈవెంట్‌ ఆసాంతం మెగా ఫ్యామిలీ పేరు కూడా ప్రస్తావించలేదు. దీంతో ఈవెంట్‌ వన్‌ మ్యాన్‌ షోగా మారిపోయింది. ఇక రిలీజ్‌ సందర్భంగా నెటిజన్లు సెర్చ్‌ చేసిన ఒకే ఒక్క పాయింట్‌ కూడా విబేధాలకు ఊతం ఇస్తోంది. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న పుష్పా 2 సినిమాకు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ గ్రీటింగ్స్‌ ఇస్తారా… లేదా అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే కేవలం సాయిధరమ్‌తేజ్‌ తప్ప మరెవరూ పుష్పా 2కు గ్రీటింగ్స్‌ ఇవ్వలేదు. ఇక వివాదాస్పద కామెంట్లు చేసే నాగబాబు కూడా.. పుష్పా, అల్లు అర్జున్‌, సుకుమార్, మైత్రీ మూవీస్‌ అనే పేర్లు ప్రస్తావించకుండా… సినీ పరిశ్రమకు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : వెంకట్రామిరెడ్డిని ఉద్యోగులు తరిమి కొట్టారా…?

ఇక ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట విషయంలో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉంది. ఈ విషయంలో అల్లు ఫ్యామిలీకి అండగా నిలవకలేదు. వీటన్నిటికి తోడు ప్రీమియర్‌ షోకు శిల్పా రవి ఫ్యామిలీ రావడం… దానికి మీడియా, అభిమానులు పెద్ద ఎత్తున హైప్‌ ఇచ్చారు. మరోవైపు బన్నీని వైసీపీ నేతలు సొంతం చేసుకున్నారు. పవన్‌కు వ్యతిరేకంగా బన్నీని ఎంకరేజ్‌ చేసేందుకు థియేటర్ల వద్ద వేసిన ఫ్లైక్సీల్లో పలుచోట్ల వైసీపీ అధినేత జగన్‌ ఫోటో, స్థానిక నేతల ఫోటోలు వేయటం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ప్రస్తుతం ఈ వివాదంలో మెగా – అల్లు ఫ్యామిలీస్‌ తగ్గేదె లే అంటున్నాయనేది అటు పొలిటికల్‌, ఇటు సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్