Friday, September 12, 2025 11:01 PM
Friday, September 12, 2025 11:01 PM
roots

వెంకట్రామిరెడ్డిని ఉద్యోగులు తరిమి కొట్టారా…?

ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఉద్యోగులు గత రాష్ట్ర ప్రభుత్వానికి ఊడిగం చేసారు అనేది వారి వ్యవహారశైలి చూస్తే మనకు స్పష్టంగా అర్ధమవుతూ ఉంటుంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకటరామి రెడ్డి అయితే వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ అతి చేసారనేది స్పష్టంగా అర్ధమవుతూ ఉంటుంది. సచివాలయ ఉద్యోగులను వైసీపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసారు ఆయన. ఇక వైసీపీకి ఎన్నికల ప్రచారం చేయడంతో ఆయనను సస్పెండ్ చేసింది ఎన్నికల సంఘం. ఇప్పుడు వెంకటరామి రెడ్డికి మరో షాక్ తగిలింది.

Also Read :హీరోలకు ఇది కరెక్టా.. ఆ ప్రాణానికి బాధ్యత ఎవరిది..?

ఏపీ సచివాలయ కోఆపరేటివ్‌ క్యాంటీన్‌ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి గట్టి షాక్‌ ఇచ్చారు ఉద్యోగులు. ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంతో వెంకటరామి రెడ్డికి సచివాలయంలో పట్టు లేదనే విషయం స్పష్టం అయింది. క్యాంటిన్ ఎన్నికల కోసం ఆయన ఉద్యోగులకు మందు పార్టీ కూడా ఇచ్చారు. దీనిపై పోలీసులు దాడి చేసి వెంకటరామి రెడ్డిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో అప్సా మాజీ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ, మాజీ కార్యదర్శి గొలిమి రామకృష్ణ మద్దతుతో పోటీ చేసిన 11మంది అభ్యర్థుల్లో 10 మంది ఘన విజయం సాధించడం గమనార్హం.

Also Read :ప్లీజ్ రోహిత్… వాళ్ళు వచ్చేశారు… నీ కోసమే వెయిటింగ్ హిట్ మ్యాన్

ఒకరు స్వతంత్రంగా ఈ ఎన్నికల్లో గెలిచారు. ఏపీ సచివాలయ కోఆపరేటివ్‌ క్యాంటీన్‌ ఎన్నికలు బుధవారం నిర్వహించగా… 11 డైరెక్టర్‌ పదవుల కోసం 28మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 1,058 మంది ఓటర్లు ఉండగా 937 మంది ఉద్యోగులు ఓటు వేసారు. ఈ ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లు క్యాంటీన్‌ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మురళీకృష్ణ, రామకృష్ణ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో వెంకటరామి రెడ్డిని సచివాలయం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కొందరు ఉద్యోగులు కామెంట్స్ చేస్తున్నారు. వెంకటరామి రెడ్డి కారణంగా తమ డిమాండ్ లు ప్రభుత్వానికి చెప్పలేకపోయాం అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులను ఆయన బెదిరించి వైసీపీకి అనుకూలంగా పనులు చేయిన్చారనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్