Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

హీరోలకు ఇది కరెక్టా.. ఆ ప్రాణానికి బాధ్యత ఎవరిది..?

ఒక సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కరెక్ట్… ఒక సినిమా కోసం అభిమానులు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు కాదు అనలేం… హీరో పేరు వింటే పిచ్చి ఎక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు ఎవరూ కాదు అనరు… కాని అభిమానుల ప్రాణాలను కూడా ఆ హీరో ఆ సినిమా మేకర్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ లో సంధ్య 70 ఎంఎంలో బుధవారం సాయంత్రం షో స్టార్ట్ చేసారు. ఈ షోకి హీరో అల్లు అర్జున్ వెళ్ళాడు.

Also read : నోర్ముయ్.. ప్రెస్‌మీట్‌లోనే అజిత్ పవార్‌పై ఏక్‌నాథ్ షిండే ఫైర్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూస్తా అని ప్రకటన చేయడంతో వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అంత తక్కువ స్థలంలో అభిమానులను కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టమైపోయింది. దీనితో ఓ నిండు ప్రాణం బలైపోయింది. పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరగడంతో… ఓ మహిళ ప్రాణాలు విడిచింది. దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ X రోడ్స్ లోని సంధ్య 70 mmకు వెళ్ళారు.

Also read : కార్యకర్తలు.. అభిమానులు ఒక్కటే అని ప్రూవ్ చేసిన పుష్ప 2

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కొడుకుకు పోలీసులు సిపీఆర్ చేసి బ్రతికించారు. వెంటనే ఆ ఇద్దరినీ పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు. ఇలా పుష్ప 2 సినిమా ఓ కుటుంబానికి తీవ్ర చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబమే రోడ్డున పడిపోయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్