Friday, September 12, 2025 09:32 PM
Friday, September 12, 2025 09:32 PM
roots

మరో ఐపిఎస్ కు మూడింది

అడిషనల్ డీ జీ పీ, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్. సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సంజయ్ అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డట్టు అభియోగాలు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా, కోట్ల రూపాయల దుర్వినియోగాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న్నాయి. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించింది.

Also Read : చంద్రబాబు అడ్రస్ మారుతోంది 

సంజయ్ పై వచ్చిన ఫిర్యాదుల పై విజిలెన్స్ కు ఆదేశించిన ప్రభుత్వం… విజిలెన్స్ నివేదిక ఆధారంగా సంజయ్ పై చర్యలు తీసుకుంది. దీంతో సంజయ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. 1996 వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన అధికారి ఐ పీ ఎస్ సంజయ్. అగ్నిమాపక శాఖలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లను ఆన్లైన్ లో జారీచేసేందుకు అగ్ని- ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు అక్రమంగా కట్టాబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

Also Read : నా భార్య ఫోన్ కాల్స్ రికార్డ్ చేశాడు.. హరీష్ రావు పై యువకుడి సంచలన ఆరోపణలు

సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్ట దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారన్న మరో ఆరోపణ కూడా ఉంది. వాటి ద్వారా ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. సౌత్రికా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ రెండూ సంస్థలు ఒకటే అని నిర్దారణకు వచ్చారు విచారణ అధికారులు. వీటిని వేర్వేరు సంస్థల్లా చూపి టెండర్లలో పాల్గొనేలా చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కో కాంట్రాక్టును ఒక్కో సంస్థకు కట్టబెట్టినట్టు ఆధారాలు సేకరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్