Friday, September 12, 2025 09:36 PM
Friday, September 12, 2025 09:36 PM
roots

కాఫీ ఫస్ట్ సిప్ తాగినప్పుడు శరీరంలో వచ్చే మార్పులు తెలుసా…?

ఉదయాన్నే లేవగానే కాఫీ లేదా టీ అనేది మన జీవనశైలిలో ఓ భాగం. చాలా మంది అలవాటు స్థాయి దాటి బానిసలు అయిపోయారు. కాఫీ లేదా టీ… ఉదయాన్నే తాగకపోతే తలనొప్పి లేదా కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొంటారు అని పలు నివేదికలు కూడా ఇప్పటికే బయటపెట్టాయి. మరి మనం ఉదయాన్నే కాఫీ ఫస్ట్ సిప్ తాగినప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటీ…? మన శరీర అవయవాలపై కెఫీన్ ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుంది…? గుండె వేగంపై ఏమైనా ప్రభావం చూపుతుందా…? ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం.

మన దేశంలో సగటు కాఫీ వినియోగం ఒక వ్యక్తి సంవత్సరానికి 30 కప్పులు తాగుతాడు. బ్రిటిష్ కాఫీ అసోసియేషన్ ప్రకారం బ్రిటన్ లో ప్రజలు దాదాపు 95 మిలియన్ కప్పుల కాఫీని తాగుతారని గుర్తించారు. బ్రిటీష్ దినపత్రిక, ది టెలిగ్రాఫ్‌ నివేదిక ప్రకారం… మొదటి సిప్ తర్వాత మన శరీరంపై కెఫిన్ వినియోగ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ నివేదిక ప్రకారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కెఫీన్ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయని పరిశోధనల్లో గుర్తించారు.

Also Read : తిరుమలలో ముంతాజ్ హోటల్ రగడ, స్వామీజీల డిమాండ్ ఏంటీ…?

కింగ్స్ కాలేజ్ లండన్‌లో న్యూట్రిషన్, డైటెటిక్స్ ప్రొఫెసర్ ఈ విషయాలను బయటపెట్టారు. కెఫీన్ ప్రభావాలు మన అలవాట్లు, వర్క్ లైఫ్, లింగ భేదాలపై ఆధారపడి ఉండవచ్చని వెల్లడించారు. రక్తంలోకి కెఫీన్ ప్రవేశించిన తర్వాతి నుంచి మార్పులు మొదలయ్యే అవకాశం ఉందని తెలిపాఋ. మన రక్తంలోకి కెఫీన్ వెళ్ళడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందని… అప్పటి నుంచే హార్ట్ బీట్ లో కూడా మార్పులు మొదలయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కాఫీ తాగిన వారి హృదయ స్పందన రేటు పెరుగుతుందని గుర్తించారు.

కాఫీ తాగిన తర్వాత మీకు కలిగే మొదటి అనుభూతి ఇదని ఆయన వెల్లడించారు. మీరు కాస్త కూల్ గా ప్రశాంతంగా ఉంటే కాఫీ తాగిన 20 నిమిషాల తర్వాత మీలో కాస్త ఆవేశం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసారు. అందుకే చాలా మంది ఉదయం పూట కప్పు కాఫీ తాగాలని భావిస్తారని, అప్పుడే తమ పనిలో నిమగ్నం కావడం వారికి సాధ్యమవుతుందని వెల్లడించారు. 20 నిమిషాల తర్వాత, మన ఏకాగ్రత స్థాయిలు పెరగడం మొదలవుతుందని… దాదాపు గంట వరకు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

Also Read : నా భార్య ఫోన్ కాల్స్ రికార్డ్ చేశాడు.. హరీష్ రావు పై యువకుడి సంచలన ఆరోపణలు

అయితే మన జీవన ప్రక్రియపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు. కప్పు కాఫీ తాగిన అరగంట తర్వాత, మూత్ర విసర్జన చేయాలనే కోరిక కూడా వస్తుందని… అందుకే వర్క్ లైఫ్ లో కొందరు కాఫీ తాగిన తర్వాత టాయిలెట్ కు వెళ్తారని ది టెలిగ్రాఫ్ కు వివరించారు. 60 నుంచి 90 నిమిషాల తర్వాత, కెఫీన్ మీ ప్రేగులపై ప్రభావం చూపుతుందని… ఫలితంగా మీ శరీరం నుండి వ్యర్థాలు సాధారణం కంటే వేగంగా బయటకు వెళ్తాయని వాస్తవానికి, కెఫీన్ పెద్దప్రేగును నీటి కంటే 60% ఎక్కువ చురుకుగా మారుస్తుందని, పేగుల పనితీరుపై కూడా ప్రభావం పడుతుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కాఫీ తాగితే, 11 గంటలలోపు కాస్త బద్ధకంగా ఉంటారని… అందుకే క్రమం తప్పకుండా కాఫీ తాగాలని భావిస్తారని… మధ్యాహ్నం 12 గంటల తర్వాత కెఫీన్ మీ శరీరం నుంచి బయటకు వెళ్తుందని గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్