ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో గత పదేళ్ళలో రెండు సార్లు టీడీపీ వచ్చినా తెలంగాణాలో ఆ పార్టీ కార్యకర్తలు అధికారం చూసి 20 ఏళ్ళు దాటింది. అయినా సరే అక్కడి కార్యకర్తల్లో మాత్రం జోష్ ఎక్కడా తగ్గలేదు. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా సరే కార్యకర్తలు మాత్రం హుషారుగా పాల్గొంటూ ఉంటారు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో అవకాశం ఉన్నంత వరకు తెలంగాణా తెలుగుదేశం కార్యకర్తలు పని చేసారు. ఇక సభ్యత్వ నమోదు విషయంలో కూడా ఈసారి తెలంగాణా దుమ్ము రేపింది అని లెక్కలు చెప్తున్నాయి.
Also Read : ఆ నేతల మధ్య సఖ్యత కుదురుతుందా…?
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పార్టీ సభ్యత్వ నమోదు నిన్నటి 50 లక్షలకు చేరింది. 93,299 సభ్యత్వాలతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవగా… 82,176 సభ్యత్వాలతో కుప్పం.. 77,720తో కళ్యాణదుర్గం, 72,720తో పాలకొల్లు, 65,899తో మంగళగిరి నియోజకవర్గాలు ముందు వరుసలో నిలిచాయి. తెలంగాణలోనూ సభ్యత్వ నమోదు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు జరిగింది.
Also Read : బాబు టార్గెట్ అదే… బీ కేర్ ఫుల్..!
స్థానిక నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకుని… పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా సభ్యత్వాన్ని ముందు ఉండి నడిపించారు. ఇక క్రియాశీలంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు… పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ‘పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు వేగంగా సాగుతోందన్నారు. ఇదిలా ఉంటె… లోకేష్ నేతృత్వంలో గత ఐదే ళ్లలో కార్యకర్తల సంక్షేమానికి 135 కోట్లు ఖర్చు చేసారు. 100 సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో ఉన్న రూ.2 లక్షల ప్రమాద భీమా ఇప్పుదు ఐదు లక్షల కి పెంచారు.