Saturday, September 13, 2025 02:45 AM
Saturday, September 13, 2025 02:45 AM
roots

బాబు టార్గెట్ అదే… బీ కేర్ ఫుల్..!

రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు అనే పేరుకు ఓ బ్రాండ్ ఉంటుంది. విజనరీగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు… అదే సమయంలో ఓ క్లాస్ పొలిటిషన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం రాజకీయ విమర్శలే తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లలేదు. అయితే అలాంటి చంద్రబాబు ఈగోను హర్ట్ చేశారు వైసీపీ నేతలు. 2019లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 2024 ఎన్నికల్లో ఓటమి వరకు టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా వ్యవహరించారు.. వ్యక్తిత్వ హననం చేశారు. ఇంట్లో మహిళలపై నీచమైన కామెంట్లు చేశారు.

Also Read : జగన్ నిర్ణయంతో కంగారులో వైసీపీ నాయకులు

అవి సరిపోవన్నట్లు శాసనసభలోనే దుర్భాషలాడారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తామంటూ సవాల్ చేశారు. అన్నీ విన్నారు… ఓపికగా భరించారు చంద్రబాబు…. పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే నాలుగు అడుగులు ముందుకు దూకుతుందనే అర్థం. అందుకే సరైన సమయంలో వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారు. వై నాట్ 175 అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు మరో టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోందనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కేవలం మూడు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే గెలిచింది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరులో మాత్రమే టీడీపీ ఎంపీలు గెలిచారు.

ఇక ఆ తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారటంతో పార్లమెంట్‌లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సంఖ్యాబలం లేకపోవటం వల్ల టీడీపీకి ఏ కమిటీలో కూడా స్థానం దక్కలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైసీపీ నేతలు… టీడీపీ క్లోజ్ అంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏపీలో వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తిరుపతి, కడప, రాజంపేట, అరకు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఇక రాజ్యసభ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎంపీలు జగన్‌కు గుడ్ బై చెప్పేశారు. దీంతో వైసీపీ బలం తగ్గుతోంది. రాబోయే రోజుల్లో మరికొందరు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

Also Read : విజయ్ పాల్ అరెస్ట్ కి లైన్ క్లియర్

ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మహత్కార్యం పూర్తవుతుందని ఏపీ టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు సెటైర్లు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మినహా… మిగిలిన ఎంపీలంతా జంప్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే జరిగితే… పార్లమెంట్‌లో వైసీపీకి గుర్తింపు లేకుండా పోతుంది. అప్పుడు వైసీపీ పరువు ఢిల్లీలో కూడా పోతుందనేది టీడీపీ నేతల మాట. ఆ దిశగానే చంద్రబాబు పావులు కదుపుతున్నారనే మాట ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీకి ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశం ఉందంటున్నారు. బాబు గట్టిగానే ఫిక్స్ అయ్యారని… కాబట్టి బీ కేర్ ఫుల్ వైసీపీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్