Saturday, September 13, 2025 12:59 AM
Saturday, September 13, 2025 12:59 AM
roots

పెద్దిరెడ్డి కోసం పవన్ భారీ ప్లాన్….!

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అసవరం లేని పేరు. ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించారు. రాజకీయ వారసులుగా రాజంపేట ఎంపీగా కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొనసాగుతుండగా… తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నాడు. జగన్‌ పైన, వైసీపీ పైన భారీస్థాయిలో వ్యతిరేకతలో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగాడు పెద్దిరెడ్డి. ఆయన చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలి. ఇక ఆయనను ఎదిరించిన వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడంలో పెద్దిరెడ్డి సిద్ధహస్తులు కూడా.

అలాంటి పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా ప్లాన్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సరే… పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డి అనుచరులదే పై చెయ్యి. చివరికి సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ అభిమానులను విచక్షణా రహితంగా కొట్టారు కొందరు పెద్దిరెడ్డి మద్దతుదారులు. నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎలా ఎగురుతుందో చూస్తామంటూ సవాల్ విసిరారు కూడా. రానున్న స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరులో పట్టు సాధించాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా కార్యాచరణను అమలు చేస్తున్నాయి.

Also Read : ఆ నేతల మధ్య సఖ్యత కుదురుతుందా…?

పుంగనూరు టికెట్ ఆశించి భంగపడిన వేణుగోపాల్ రెడ్డిని పవన్ ఇప్పుడు రంగంలోకి దింపారు. నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ నమోదులో వేణుగోపాల్ రెడ్డి దూకుడు ప్రదర్శించారు. రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించారు. అలాగే పుంగనూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు వేణుగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. 1978లో తొలిసారి పీలేరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి… 2009 నుంచి పుంగనూరును తన అడ్డాగా మార్చుకున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి అడ్డా అనేలా మార్చేశారు.

ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన నాయకులు, అభిమానులపై పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేశారు. చివరికి పవన్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీపాడ్ కూడా ధ్వంసం చేశారు. పార్టీకి బలం ఉన్నప్పటికీ.. పెద్దిరెడ్డి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయగల నాయకుడు లేకపోవడం వల్లే ఈస్థాయిలో నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతున్నాయనేది పవన్ భావన. పుంగనూరులో టార్గెట్ పెద్దిరెడ్డి అన్నట్లుగా పవన్ పావులు కదుపుతున్నారు. వేణుగోపాల్ రెడ్డిని రాజకీయ తెరపైకి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులతో వేణుగోపాల్ రెడ్డి చర్చిస్తున్నారు.

Also Read : డ్రోన్ ఎగిరితే చాలు… పోలీసులే షాక్ అవుతున్నారు…!

గతంలో పుంగనూరులో 60 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచిన పెద్దిరెడ్డికి ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 6 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. దీనికి స్థానిక టీడీపీ, జనసేన నేతలంతా కలిసికట్టుగా పనిచేయడమే కారణం అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చల్లా రామచంద్రారెడ్డికి బదులుగా ఈసారి వేణుగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. పుంగనూరు అభివృద్ధే తన లక్ష్యమని ప్రకటించారు. పెద్దిరెడ్డి వల్ల జరిగిన లాభమేమిటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ద్వారా నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకోవాలని జనసేన నేతలు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్