డ్రోన్ టెక్నాలజీని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా వినియోగిస్తోంది. డ్రోన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే డ్రోన్ వినియోగాన్ని అన్ని రంగాల్లో పెంచుతున్నారు. విజయవాడ వరదల్లో బాధితులకు ఆహారం అందించడం మొదలు.. వ్యవసాయ రంగం వరకు డ్రోన్‌లను వాడేస్తోంది. ఇక తాజాగా పోలీస్ శాఖలో కూడా డ్రోన్ వినియోగం పెంచారు. ఇప్పటికే విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు డ్రోన్ సాయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాకు రెండు డ్రోన్‌లను కేటాయించింది పోలీస్ శాఖ. ఇవి గాల్లో ఎగురుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
Also Read : విజయ్ పాల్ అరెస్ట్ కి లైన్ క్లియర్
అన్ని జిల్లాల్లో డ్రోన్‌ల సాయంతో పోలీసులు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. మారుమూల ప్రాంతాల్లో, నిర్మానుష ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న వారిని, గంజాయి విక్రయిస్తున్న వారినే టార్గెట్‌గా డ్రోన్ గాల్లో ఎగురుతోంది. బర్డ్ ఐ టెక్నాలజీ ద్వారా అక్రమార్కుల ఫోటోలను క్లియర్‌గా తీస్తున్నాయి కూడా. దాదాపు 700 నుంచి వెయ్యి మీటర్ల ఎత్తులో ఎగురుతున్న డ్రోన్ దగ్గరికి వచ్చే వరకు దాని గురించి తెలియదు. ఇక డ్రోన్ శబ్దం రాగానే నిందితులు పరుగులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు డ్రోన్ సాయంతో పర్యవేక్షణ చేస్తున్న పోలీసులు… కొన్ని దృశ్యాలు చూసి షాక్ అవుతున్నారు. తుప్పల్లో పోలీసులకు ఎక్కువగా ప్రేమజంటలు కనిపిస్తున్నాయి.
Also Read : మరో మాజీ ఎమ్మెల్యేకి ఎర్త్ పెట్టిన బాబు సర్కార్
పొదల మాటున నక్కిన లవర్స్ దృశ్యాలే డ్రోన్‌కు చిక్కుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో అవాక్కవుతున్నారు పోలీసులు. ఇక డ్రోన్ కెమెరాకు చిక్కిన ప్రేమ పావురాలు… ఏం చేయాలో తెలియక పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రేమ జంటలను గుర్తిస్తున్న పోలీసులు… తెలిసిన వారి పిల్లలైతే తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇక తెలియని వారైతే మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు. తుప్పల్లోకి, నిర్మానుష ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోకిరీలు, మందుబాబులు, ఆకతాయిల కంటబడితే ప్రమాదమని పోలీసులు సూచిస్తున్నారు.