Friday, September 12, 2025 10:34 PM
Friday, September 12, 2025 10:34 PM
roots

విజయ్ పాల్ అరెస్ట్ కి లైన్ క్లియర్

గత ప్రభుత్వ హయాంలో అధికారులతో ప్రత్యర్ధులను వైఎస్ జగన్ సర్కార్ ఇబ్బందులు పెడితే ఇప్పుడు చట్టం దెబ్బకు… ఆ అధికారులు చుక్కలు చూస్తున్నారు. తనకు ఎదురు తిరిగాడు అనే కారణంతో రఘురామకృష్ణo రాజు విషయంలో వైసీపీ సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఆ సమయంలో… ఆయన్ను జైల్లో పెట్టి వేధించారు పోలీసులు. దీనిపై రఘురామ న్యాయ పోరాటానికి దిగారు. అప్పటి దర్యాప్తు అధికారి విజయ్ పాల్ పై ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.

Also Read: ఆ తప్పంతా జగన్ దే.. బాలినేని సంచలన ఆరోపణలు

తాజాగా కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టులో పోలీసు అధికారి విజయ్ పాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయపాల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. విజయ్ పాల్ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న ల ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది. గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు విజయ్ పాల్.

Also Read: రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సర్వం సిద్దం

దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందించారు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని పేర్కొన్నారు. నన్ను దారుణంగా చిత్రవద చేశారు.. చంపాలని చూసారని… మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. త్వరలో నా కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవారంతా బయటకు వస్తారన్నారు. ఇప్పుడు నేను ఏపార్టీ పై విమర్శలు చేయనని స్పష్టం చేసారు. నా కేసు గురించి మాట్లాడే హక్కు నాకుందన్నారు. శాసన సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్