Friday, September 12, 2025 10:35 PM
Friday, September 12, 2025 10:35 PM
roots

రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సర్వం సిద్దం

గత ప్రభుత్వం అండ చూసుకుని చెలరేగిపోయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముహూర్తం ఫిక్స్ చేసారు ఏపీ పోలీసులు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు దేశం పార్టీ నేతలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ తన సినిమాలలో వారి పాత్రలను అసభ్యంగా చూపిస్తూ రామ్ గోపాల్ వర్మ చెలరేగిపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత సైలెంట్ గా ఉన్న వర్మపై పోలీసులు ఫోకస్ పెట్టారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆయనపై పలు కేసులు నమోదు చేసారు.

Also Read: చెల్లెలు రాకతో అసలు సవాల్ మొదలు…!

రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆయనపై మరో కేసు నమోదు చేసారు. ఈ రెండు కేసుల విచారణకు వెళ్ళకుండా కోర్ట్ ద్వారా తప్పించుకోవాలని వర్మ భావించారు. తాను విచారణకు రాకుండా వర్మ… తన లాయర్ ను పంపించారు. ఇక తాను సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా అని వర్మ తప్పించుకునే ప్రయత్నం చేసారు. కాని ఏ షూటింగ్ లేదనే విషయం తర్వాత క్లారిటీ వచ్చింది.

Also Read: ఆ పదవుల భర్తీ ఎప్పుడు బాబు గారు..?

ఇప్పుడు ఇక వర్మను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేసారు. విచారణకు రాకుండా తప్పించుకుంటున్న వర్మను… అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. విచారణకు రావాలంటూ ఇప్పటికే ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు… ఆయన కావాలనే కాలయాపన చేయడంతో… అదుపులోకి తీసుకోవడానికి సిద్దమయ్యారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకుండా పోలీసులు ప్లాన్ చేసారు. ఈ నెల 24న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా విచారణకు వర్మ హాజరు కాలేదు. ఆర్జీవీ తీరుపై ప్రకాశం పోలీసులు సీరియస్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి చేరుకున్న పోలీసులు… కాసేపట్లో ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్