Tuesday, October 28, 2025 02:25 AM
Tuesday, October 28, 2025 02:25 AM
roots

కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం

నిప్పులు చెరిగే బంతులు… ఊహించని బౌన్స్… శరీరంపై దూసుకు వస్తున్న బులెట్ లాంటి బంతులు… బ్యాట్ అడ్డం పెట్టాలన్నా సరే భయపడే పరిస్థితి. బాల్ ఎటు స్వింగ్ అవుతుందో అర్ధం కాని పరిస్థితి. సాధారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ప్రత్యర్ధులకు ఎదురయ్యే పరిస్థితి ఇది. కానీ తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు… ప్రత్యర్ధి కోసం తయారు చేసిన పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ బొక్క బోర్లా పడ్డారు. ఏ విధంగా ఆడాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు. బూమ్రా ఇచ్చిన బూస్ట్ ను హర్షిత్ రానా, సిరాజ్ ఇద్దరూ కంటిన్యూ చేసారు.

Also read : ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి అరంగేట్రం

పిచ్ పై బంతి చక్కగా బౌన్స్ అవుతోంది. ఎక్కువ స్వింగ్ కావట్లేదు… అందుకే బూమ్రా టీం సీమ్ ను చక్కగా వాడుకుంది. ముగ్గురు పేసర్లే ఆస్ట్రేలియా పతనాన్ని శాశించారు. 67 పరుగులకే ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మాన్ గా పేరున్న లబుశేన్ అయితే ఒక్క పరుగు చేయడానికి 42 బంతులు తీసుకున్నాడు. 52 బంతులు ఆడి… చేసింది రెండు పరుగులే. పైగా అందులో ఓ లైఫ్. తన అటాకింగ్ బ్యాటింగ్ తో భారత్ ను ఆత్మరక్షణలో పడేయాలని చూసిన ట్రావిస్ హెడ్ ను అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసాడు హర్షిత్ రానా.

Also Read : జైస్వాల్ ను టెంప్ట్ చేస్తే చాలా…?

ముందు సిరాజ్ మంచి బౌలింగ్ చేసినా వికెట్ లు పడక ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కీలకమైన రెండు వికెట్ లు పడగొట్టి మంచి జోష్ నింపాడు. భారత్ 150 పరుగులే చేసినా బౌలర్లు మాత్రం లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ తో… ఆస్ట్రేలియాకు వారి దేశంలోనే చుక్కలు చూపించారు. స్మిత్, లబుశేన్, కవాజా ఎవరూ కూడా కనీసం 5 పరుగులు చేయలేకపోయారు. వీలైనంత వేగంగా మరో మూడు వికెట్ లు పడగొడితే… భారత్ మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు. పెర్త్ లో భారత్ గెలవడం చిరకాల కల… అసలు కలిసిరాని పిచ్ పై భారత్ ఈసారి చెలరేగిపోవడం చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్