Tuesday, October 28, 2025 02:29 AM
Tuesday, October 28, 2025 02:29 AM
roots

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..?

తెలంగాణాలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్దమైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. దాదాపు ఆరు నెలల నుంచి మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు అది ముందుకు అడుగు పడలేదు అనే చెప్పాలి. డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. ఆర్ ఓ ఆర్ చట్టాన్ని ఆమోదించనున్న అసెంబ్లీ.. రైతు, కుల గణన సర్వే పై చర్చించే అవకాశం ఉంది.

Also Read : ఇక సెలవ్.. పోసాని సంచలన నిర్ణయం

మహారాష్ట్ర ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనపడుతోంది. డిసెంబర్ 7 తో రేవంత్ సర్కార్ కు ఏడాది పూర్తి అవుతుంది. ఆ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. పంచాయతీ ఎన్నికల పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే ఎన్నికల నిర్వహణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొండపోచమ్మ సాగర్ దగ్గర లో ఉన్న హరీష్ రావు ఫామ్ హౌస్ పై కూడా ప్రభుత్వం విచారణ చేస్తోంది.

దీనిపై అసెంబ్లీలో కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది. తెలంగాణ క్యాబినెట్లో ఇంకా ఆరుగురు మంత్రులకు అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగియడంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కనుంది. విస్తరణ తో పాటు శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓ ఇద్దరు మంత్రులకు కేబినేట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.

Also Read : కమ్మ జిల్లాల్లో రెడ్ల ఆధిపత్యం

కేబినేట్ లో ఇప్పటి వరకు మైనారిటీకి చోటు దక్కలేదు. ఈ విస్తరణ లో మైనారిటీకి కేబినెట్ లో చోటు కల్పిస్తారు. యువతకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి బెర్త్ తప్పకుండా ఇస్తామని సీఎం హామీ ఇవ్వడంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ నుండి రేస్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి నుండి మరో ఇద్దరు ఆశావహులు ఉన్నారు. మొత్తం 6 బెర్తుల కోసం 10 మంది పేర్లు పరిశీలిస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి. మరి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్