Saturday, September 13, 2025 03:06 AM
Saturday, September 13, 2025 03:06 AM
roots

టీటీడీ ప్రక్షాళన నిజంగా సాధ్యమేనా..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం. నిత్యం సుమారుగా 70-80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక పండుగలు, వారాంతం రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుంది. వసతి, ప్రసాదం, హుండీ ఆదాయమే సగటున రూ.4 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి పవిత్రమైన ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం కేవలం ఒక ఆదాయ మార్గంలానే చూసింది. వసతి గదుల ధరలు డబుల్ చేయటంతో పాటు ప్రసాదం నాణ్యత కూడా పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. ముందుగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పెంచడంలో భాగంగా నాణ్యమైన సరుకులు వినియోగిస్తోంది.

Also Read : జైస్వాల్ ను టెంప్ట్ చేస్తే చాలా…?

ఇంకా కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేస్తామని టీటీడీ బోర్డు ఛైర్మన్ బీ ఆర్ నాయుడు ప్రకటించారు. ఇప్పుడు ఇదే పెద్ద సవాల్ గా మారేలా ఉందంటున్నారు విశ్లేషకులు. టీడీపీలో ప్రస్తుతం 500 మంది వరకు అన్య మతస్థులు పనిచేస్తున్నారు. వందల సంఖ్యలో ఉన్న హిందూయేతరులను తరలించడం సాధ్యమా..? అలా చేస్తే ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యలను ఎలా ఎదుర్కోంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read : బరితెగించిన నాటి జగన్ సర్కార్.. ఇదిగో మరో ఆధారం

ఇప్పటికే ఉద్యోగుల వివరాలను విజిలెన్స్ సిబ్బంది సేకరిస్తోంది. వీరిని ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు తరలించాలంటే ముందుగా వారి అంగీకారం తీసుకోవాలి. ఆ తర్వాత వారి స్థాయిని బట్టి ప్రభుత్వంలోని మరో విభాగానికి బదిలీ చేయాలి. టీటీడీ సిబ్బంది చాలా వరకు తిరుపతిలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అలాంటి వారు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అంగీకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో హిందూయేతరుల విషయంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుందనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్