Friday, September 12, 2025 11:14 PM
Friday, September 12, 2025 11:14 PM
roots

బరితెగించిన నాటి జగన్ సర్కార్.. ఇదిగో మరో ఆధారం

వైసీపీ ప్రభుత్వంలో అన్ని శాఖలను తమకు అనుకూలంగా మార్చేకున్నారు వైసీపీ నేతలు. ఇంకా చెప్పాలంటే… జగన్‌కు అనుకూలంగా ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే అన్ని ప్రభుత్వ శాఖలను కూడా తమ సొంత సంస్థల మాదిరిగా వినియోగించుకున్నారు. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను, తనకు భజన చేసిన వ్యక్తులకు కూడా ప్రభుత్వం తరఫున లబ్ది జరిగేలా జగన్ సర్కార్‌ వ్యవహరించింది. ఎలాంటి అర్హత లేని వ్యక్తులకు కూడా ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లించారు. అర్హులైన వారిని పక్కన పెట్టిన అధికారులు… జగన్ సూచించిన వారికి రెడ్‌ కార్పెట్‌ పరిచారు.

Also Read : దొంగ కార్ల దొంగతనం… ఐఏఎస్ అధికారి భార్య కక్కుర్తి

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ ఇంటూరి రవికిరణ్‌కు వైసీపీ సర్కార్‌ కావాల్సినంత సాయం చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రజల సొమ్మును అప్పనంగా దోచిపెట్టింది కూడా. వైసీపీకి భజన చేయడంతో పాటు ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడం, మార్ఫింగ్‌ ఫోటోలు పెట్టడంలో ఇంటూరి రవికిరణ్‌కు మరెవరు సాటి రాలేదు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే తరహా తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ, జనసేన అభిమానులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఇంటూరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే ప్రభుత్వం మారిన వెంటనే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నెలా ఇంటూరి రవికిరణ్‌కు రూ.73 వేలు చెల్లించింది ప్రభుత్వం. అసలు ఏ హోదాలో ఉన్నందుకు చెల్లించారో ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదు. ఇప్పుడు మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. అది సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల నిర్వాకం. అర్హులైన మీడియా ప్రతినిధులకు మాత్రమే ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డును ఇంటూరి రవికిరణ్‌కు జారీ చేశారు. అది కూడా ఏపీ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా అనుమతి ఇచ్చారు. అసలు డిజిటల్ కార్పొరేషన్‌లో పనిచేసే వారికి అక్రిడేషన్ ఎలా ఇచ్చారో తెలియటం లేదు.

Also Read : అదానీ దెబ్బతో జగన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రిడేషన్ కార్డు జారీ విధానంలో చాలా మార్పులు చేశారు. పని చేస్తున్న సంస్థ పేరు, స్థాయి, గతంలో పొందిన అక్రిడేషన్ వివరాలతో పాటు కంపెనీ లైసెన్స్‌తో పాటు పూర్వానుభవం… ఇలా ఎన్నో వివరాలు ఇస్తేనే అక్రిడేషన్ ఇస్తామని ఐ అండ్ పీఆర్ అధికారులు రూల్స్ పెట్టారు. దీని వల్ల చాలా మంది అర్హులు కూడా అక్రిడేషన్ పొందలేక పోయారు. కానీ ఇదే సమయంలో అసలు ఇంటూరి రవికిరణ్‌కు అక్రిడేషన్ ఇవ్వటం ఏమిటని ఇప్పుడు పలువురు సీనియర్ పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్