Friday, September 12, 2025 09:26 PM
Friday, September 12, 2025 09:26 PM
roots

గతంలో చేసిన హెచ్చరికలు ఇప్పుడేమయ్యాయి విజయసాయి?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వారి అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారిని పోలీసులు ఒక్కొక్కరిగా వెంటాడి పట్టుకుని జైల్లో వేస్తున్నారు. ఇక వారి పోస్ట్ లకు సంబంధించి హైకోర్ట్ కూడా సీరియస్ గా ఉన్న నేపధ్యంలో పోలీసులు మరింత దూకుడుగా పని చేస్తున్నారు. ఇక త్వరలోనే మరికొందరు కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. రెచ్చిపోయిన ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాం అని పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు.

Also Read : నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన తెలుగు తమ్ముళ్లు..!

అయితే ఇక్కడ వైసీపీ నాయకుల్లో అగ్ర నాయకులు సైలెంట్ గా ఉండటం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. గతంలో ఇంటూరి రవి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే… స్టేషన్ కు వెళ్లి మరి… విజయసాయి బెయిల్ ఇప్పించి విడుదల చేసి తీసుకొచ్చారు. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి వార్నింగ్ లు ఇచ్చారు. ఇది అప్పుడు టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో అరెస్ట్ లు ఆగాయి. వైసీపీ సోషల్ మీడియాలో కొత్త జోష్ వచ్చింది కూడా అప్పుడే. కాని ఇప్పుడు మాత్రం సీన్ అలా లేదు.

Also Read : జగన్ కి, చంద్రబాబు కి ఇంత తేడానా.. ఆశ్చర్యపోయిన మాజీ మంత్రి

పదుల సంఖ్యలో అరెస్ట్ లు జరుగుతున్నా విజయసాయి మాత్రం ఎక్కడా కనపడటం లేదు. అసలు వైసీపీ నేతలు కూడా తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే స్టేషన్ కు వెళ్లి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు. పీటీ వారెంట్ ఉందనే భయమో లేక మరేదైనా కారణమో తెలియదు గాని అసలు జైలుకు వెళ్లి… అండగా ఉంటాం అని చెప్తున్నారు గాని… న్యాయ సహాయం కూడా అందించే ప్రయత్నం జరగడం లేదు. ఇక బయటి నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చిన వారిని… అసలు మా పార్టీకి సంబంధం లేదని చెప్పేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్