Friday, September 12, 2025 09:13 PM
Friday, September 12, 2025 09:13 PM
roots

నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన తెలుగు తమ్ముళ్లు..!

ప్రస్తుతం వైసీపీ నేతలే టార్గెట్ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పావులు కదుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అధినేత జగన్ అండ చూసుకుని రెచ్చిపోయారు. కనీసం రాయలేని భాషలో తీవ్ర పదజాలంతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. మరికొందరైతే.. మార్ఫింగ్ వీడియోలతో నీచమైన, జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న నాథుడు లేకపోగా… తిరిగి ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెట్టారు. చివరికి న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు కొందరు వైసీపీ సైకోలు. ఇలాంటి వారిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

Also Read : పోయిరా నేస్తమా… రాజకీయ గురువుకు కన్నీటి వీడ్కోలు..!

వర్రా రవీంద్రరెడ్డి, ఇంటూరి రవికిరణ్, ఆర్జీవీ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి.. ఇలాంటి వారిపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటూరి, వర్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆర్జీవీ, శ్రీరెడ్డి, పోసాని అరెస్టు కూడా ఖాయమంటున్నారు. ఇప్పటి వరకు కార్యకర్తలపైనే ఫోకస్ పెట్టిన తెలుగు తమ్ముళ్లు… ఇప్పటి నుంచి నేతలను టార్గెట్ చేశారు. ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన నేతలు… పదవిని అడ్డుపెట్టుకుని నోటికి ఇష్టం వచ్చినట్లు వాగారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పైన కొడాలి నాని నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు.

ఇక విశాఖ ఎయిర్ పోర్టులో అయితే మంత్రి హోదాలో ఉన్న రోజా… పవన్అ భిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చగొట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ అయితే.. నీచమైన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అయితే బహిరంగ వేదికపైనే పవన్ కల్యాణ్‌పై బూతు పదాలు అనేశారు. ఇప్పుడు ఇలాంటి వారినే తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే భయపడేలా కార్యకర్తలకు బుద్ది చెప్పిన టీడీపీ అభిమానులు… ఇక నుంచి వైసీపీ నేతల నోటికి తాళం వేసేందుకు రెడీ అయ్యారు.

Also Read : ఘనంగా ఏపి కాకతీయ సేవా సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

తమ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖలో మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నానికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధి కూడా కాకపోవడంతో… నేరుగా విచారణకు రావాల్సిందే. ఇలాంటి వారిపై ఇప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలు ఏపీ వ్యాప్తంగా పోలీసు కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్